సింగపూర్‌లో(Singapore) ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ మహిళ ఆరబెట్టిన తన లోదుస్తులు మాయం అవుతుండటంతో సీసీటీవీ కెమెరా(CCTV Camera) పెట్టింది.
ఆ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు.ఓ కామాంధుడు ఆమె లోదుస్తులు దొంగిలిస్తూ కెమెరాకు చిక్కాడు.
అయితే ట్విస్ట్ ఏంటంటే.సీసీటీవీ కెమెరాను చూసిన వెంటనే వాటిని మళ్లీ అక్కడే పెట్టేసి పారిపోయాడు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
బాధితురాలు ఎలివి లిమ్(Elyvi Lim) అనే మహిళ.
తన ఇంటి బయట ఆరేసిన లోదుస్తులు తరచూ కనిపించకుండా పోతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది.ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని సీసీటీవీ (CCTV)కెమెరా ఏర్పాటు చేసింది.
జనవరి 31న కెమెరా అసలు నిజాన్ని బయటపెట్టింది.ఓ వ్యక్తి ఆమె బట్టలు ఆరేసిన చోటికి వచ్చి లోదుస్తులు దొంగిలించడం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది.
అయితే లోదుస్తులు దొంగిలించి ప్యాంట్ లో పెట్టుకుంటున్న సమయంలో అతనికి సీసీటీవీ కెమెరా కనిపించింది.అంతే ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
తాను చేస్తున్న పని రికార్డ్ అవుతోందని గ్రహించి వెంటనే దొంగిలించిన లోదుస్తులను మళ్లీ ఆరేసిన చోటే పెట్టేశాడు.ఆ తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు.
ఈ తతంగాన్ని ఎలివి లిమ్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
తన పోస్టులో “నా లోదుస్తులు దొంగిలించి, నేను గమనించకుండా మళ్లీ అక్కడే పెట్టేస్తున్నాడు.చివరకు నాకు అనుమానం వచ్చి సీసీటీవీ పెడితే ఇలా దొరికిపోయాడు.ఎవరికైనా ఈ వ్యక్తి గురించి తెలిస్తే నాకు చెప్పండి” అని ఆమె రాసుకొచ్చింది.
అంతేకాదు నిందితుడు చోవా చూ కాంగ్, యెవ్ టీ ప్రాంతాల్లో కనిపించాడని కూడా తెలిపింది.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చాలా మంది మహిళలు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
చివరికి ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరింది.ఎలివి లిమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.27 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.సీసీటీవీ కెమెరా లేకుంటే ఆ మహిళ పరువు ఏం అయ్యేదో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఈ ఘటన సింగపూర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.