సీజన్ తో పని లేకుండా ఏడాది పొడవునా లభించే అతికొద్ది పండ్లలో అరటి( Banana ) ఒకటి.చూడడానికి ఆకర్షణీయంగా తినడానికి రుచికరంగా ఉండే అరటి పండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
అరటిపండ్ల ఖరీదు తక్కువే అయినప్పటికీ వాటిలో ఉండే పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి.అందువల్ల ఆరోగ్యపరంగా అరటిపండ్లు అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి.
అరటిపండు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
ఎముకలను దృఢంగా మారుస్తుంది.కండరాల నిర్మాణంలో తోడ్పడుతుంది.
అలాగే అరటిపండు రక్తపోటును అదుపులో ఉంచి గుండె జబ్బులు( Heart Diseases ) వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.అరటిపండు డిప్రెషన్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది.
మెదడును చురుగ్గా మారుస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే అరటిపండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
అయితే తెలిసో తెలియక చాలామంది అరటిపండు తీసుకునే క్రమంలో పలు తప్పులు చేస్తుంటారు.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలతో కలిపి అరటి పండును తీసుకోవడం చాలా డేంజర్.
మరి ఆ ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో( Citrus Fruits ) అరటి పండ్లు తినకూడదు సిట్రస్ పండ్లతో అరటి పండ్లు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే పాలు మరియు అరటి పండు కూడా బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్.
అరటిపండు ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది.పాలు( Milk ) తియ్యగా ఉంటాయి.
ఇవి రెండు కలిపి తీసుకుంటే శరీరంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి.జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి.
జలుబు, దగ్గు మరియు ఇతర అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెట్టాయి.

మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మరియు అరటి పండు కలిపి లేదా ఒకేసారి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే, అధిక ప్రోటీన్ ఆహారాలతో అరటిపండు తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తుతుంది.ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్‌లతో అరటిపండ్లను తీసుకోకూడదు.
ఈ కాంబినేషన్ రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగడానికి లేదా ఆకస్మికంగా తగ్గడానికి దారితీయవచ్చు.