నోటి నుండి చెడు వాసన( Bad Smell ) రావడం అనేది చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్య.నోటి నుంచి దుర్వాసన రావడం చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.
ముఖ్యంగా ఈ సమస్య వల్ల నలుగురిలో ఉన్నప్పుడు ఏమాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు.ఇంకా చెప్పాలంటే నోరు తెరవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
ఈ క్రమంలోనే బ్యాడ్ బ్రీత్( Bad Breath ) సమస్యను వదిలించుకోవడానికి రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు రోజు బ్రష్ చేసుకున్నారంటే నోటి నుండి చెడు వాసన అన్నదే రాదు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు సోంపు( Fennel Seeds ) రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు( Cloves ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ సోంపు మరియు లవంగాల పొడిలో పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking Soda ) వేసి బాగా మిక్స్ చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.
నిత్యం ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి.

ఈ పొడిని ఎలా ఉపయోగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వాటర్ లేదా వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఉపయోగించి బ్రష్ చేసుకోవాలి.ఈ విధంగా నిత్యం కనుక చేశారంటే నోటి దుర్వాసన అనేది రాదు.

లవంగాలు సోంపు మరియు బేకింగ్ సోడా నోటిలో ఉండే బ్యాక్టీరియా ని నాశనం చేస్తాయి.అదే సమయంలో బ్యాడ్ బ్రీత్ కు అడ్డుకట్ట వేస్తాయి.నోటి నుండి చెడు వాసన వస్తుందని బాధపడుతున్న వారికి ఈ పొడి చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ పొడిని ఉపయోగించి నిత్యం బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలపై పసుపు మరకలు మాయమవుతాయి.
దంతాలు తెల్లగా కాంతివంతంగా మారతాయి.చిగుళ్ళ నుండి రక్తస్రావం, చిగుళ్ల వాపు, దంతాల పోటు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.