పెళ్ళాం పుట్టింటికి వెళ్లిందని ఆటోడ్రైవర్ ఏం చేసాడంటే?

సినిమాల్లో భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు భర్తలు సంబరపడే కామెడీ సీన్స్ చాలానే మనం చూసాం.వాటిని చూస్తూ నిజజీవితంలో కూడా ఇలాంటి సంగతులు జరుగుతాయా? అని అనుకోవడం సహజం.కానీ బెంగళూరులోని ఒక ఆటోడ్రైవర్ మాత్రం తన జీవితాన్ని ఓ సినిమా సీన్‌లా మార్చేసాడు.ఆ ఆటోడ్రైవర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ( social media )హాట్ టాపిక్‌గా మారింది.

 What Did The Auto Driver Do That He Went To The Wedding House, Bengaluru, Auto D-TeluguStop.com

ఆ డ్రైవర్ తన భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.తన ఆటోలో ప్రయాణించే వారందరికీ బిస్కెట్ ప్యాకెట్లను ఉచితంగా పంచిపెడుతూ, తన హ్యాపీనెస్‌ను అందరితో పంచుకున్నాడు.

ఆ ఆటోడ్రైవర్ తన ఆనందానికి ఓ బోర్డు కూడా తయారు చేశాడు.అందులో ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ( English and Kannada )ఏమని రాసాడంటే.“మా ఆవిడ వాళ్ల అమ్మగారింటికి వెళ్లింది… నేను హ్యాపీ!” అని తెలిపాడు.బోర్డు కింద బిస్కెట్ ప్యాకెట్లు ఉంచి, ఆటోలో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి వాటిని పంచిపెట్టాడు.

ఈ వినూత్న ఆలోచనను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.ఒకరు ఈ సంఘటనను ఫోటో తో సహా సోషల్ మీడియా లో షేర్ చేశారు.

ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.

కామెడీ సీన్స్ నిజ జీవితంలో ఎలా సెట్ చేశావయ్యా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.అతను నిజంగా స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ విషయం కాస్త అతని భార్యకు తెలిస్తే అతని సంతోషం ఎక్కువ రోజులు ఉండదేమో అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటివరకు నవ్వులు పంచిన ఈ ఆటో డ్రైవర్, అతని భార్య తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రసవత్తర సంఘటనలు కొనసాగుతాయా? లేదా? చూడాలి మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube