అవినీతి ఆరోపణలపై గతేడాది అక్టోబర్‌లో 12 నెలల జైలు శిక్షను ఎదుర్కొన్న భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ రవాణా మంత్రి ఎస్.ఈశ్వరన్‌ను(Former Singaporean Transport Minister S.
Easwaran) శుక్రవారం గృహ నిర్బంధంలో ఉంచినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.హోం డిటెక్షన్ స్కీమ్‌లో (home detection scheme) ఉంబడిన ఖైదీల మాదిరిగానే ఈశ్వరన్ తన మిగిలిన శిక్షను తన నివాసంలో నిర్ధిష్ట పరిస్ధితుల మధ్య అనుభవిస్తాడని పేర్కొంది.
ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ట్యాగ్‌ని ఉపయోగించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ మధ్య ఈశ్వరన్(Easwaran) ఉంటారని సింగపూర్ ప్రిజన్ సర్వీస్ (ఎస్‌పీఎస్)ను ఉటంకిస్తూ ఛానల్ న్యూస్ ఏషియా నివేదించింది.

కోర్ట్ తీర్పుకు అనుగుణంగా తన 12 నెలల జైలు శిక్షను గతేడాది అక్టోబర్ 7 నుంచి ఈశ్వరన్ అనుభవిస్తున్నారు.సింగపూర్ జైళ్ల చట్టం (Singapore Prisons Act)ప్రకారం.జైలులో ఖైదీల ప్రవర్తనకు అనుగుణంగా వారి శిక్షలో మూడింట రెండొంతుల శిక్ష లేదా 14 రోజుల శిక్షను అనుభవించిన తర్వాత మిగిలిన శిక్షలో ఉపశమనం పొందేందుకు అర్హులు.
అలాగే నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా గృహ నిర్బంధ పథకంపై విడుదల కావడానికి అర్హులు.గృహ నిర్బంధానికి(Under house arrest) అర్హతను నిర్ణయించేటప్పుడు జైలు సమయంలో ప్రవర్తన, పురోగతి, పునరావాసానికి ప్రతిస్పందన వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుంటామని ఎస్‌పీఎస్ తెలిపింది.

బ్రిటన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజిక్ కన్సర్ట్‌లు, సింగపూర్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ టికెట్‌లు సహా పలు వస్తువులను సింగపూర్ వ్యాపారవేత్త ఓంగ్ నుంచి ఈశ్వరన్ పొందినట్లుగా అభియోగాలు మోపారు.ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్లలో దాదాపు 4,03,300 సింగపూర్ డాలర్ల విలువైన బహుమతులు పొందినందుకు గాను హైకోర్ట్ ఈశ్వరన్‌కి 12 నెలల జైలుశిక్ష విధించింది.సింగపూర్‌లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీకి రాజీనామా చేసిన ఈశ్వరన్ జనవరి 16న రవాణా మంత్రి పదవితో పాటు తన పార్లమెంటరీ స్థానానికి కూడా రాజీనామా చేశారు.1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయన 2006లో మంత్రిగా నియమితులయ్యారు.రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.