నందమూరి బాలకృష్ణ( Balakrishna ) తనయుడు మోక్షజ్ఞ( Mokshagna )సినిమా ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Varma )దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.అందుకు అనుగుణంగానే మోక్షజ్ఞకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఇక ఈ సినిమా డిసెంబర్లోనే సెట్స్ పైకి వెళ్తుందని భావించారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయింది అంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి.

ఇలా మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ స్పందిస్తూ ఈ వార్తలన్నీ ఆవాస్తవమని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ తెలియజేస్తామని వెల్లడించారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు.ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై కూడా ఎన్నో రకాల వార్తలు బయటకి వచ్చాయి.

ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడిగా శ్రీ లీలా నటించబోతున్నారని, లేదు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ నటించబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాలను కూడా ప్రకటించలేదు కానీ నందమూరి అభిమానులు మాత్రం మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని( Meenakshi Chaudhary ) తీసుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.గత కొంతకాలంగా మీనాక్షి చౌదరి వరుస హిట్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే మోక్షజ్ఞ నటిస్తున్న ఫస్ట్ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్న అభిమానులు ఆయనకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.







