టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే (Pooja Hegde)ఒకరనే సంగతి తెలిసిందే.కెరీర్ పరంగా వరుస సినిమాలతో పూజా హెగ్డే మళ్లీ బిజీ అవుతుండగా తాజాగా ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
నేను ఇప్పటివరకు నటించిన సినిమాలు అన్నీ నేను గర్వపడేలాంటివేనని ఆమె తెలిపారు.ఆ సినిమాలతో పోల్చి చూస్తే రెట్రో మూవీ ప్రత్యేకం అని ఆమె చెప్పుకొచ్చారు.
రెట్రో (Retro)సినిమాలోని ప్రతి సీన్ నాకు ఇష్టమేనని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ సినిమాలోని సీన్స్ ను షూట్ చేసిన తీరు, వాటిలోని ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని పూజా హెగ్డే పేర్కొన్నారు.
సెట్ లో టీమ్ అందరూ ఎంతో ఎనర్జిటిక్ గా వర్క్ చేశారని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ సినిమాలో నా రోల్ ను బాగా రూపొందించారని ఆమె కామెంట్లు చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ జరుగుతోందని అందువల్ల ఈ సినిమా గురించి తాను ఎక్కువగా మాట్లాడలేనని పూజా హెగ్డే పేర్కొన్నారు.సినిమాను పూర్తిగా చూడకుండానే తాను ఈ స్థాయిలో నమ్మకంతో ఉన్నానని ఆమె వెల్లడించారు.పూజా హెగ్డే(Pooja Hegde) చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాధేశ్యామ్(Radheshyam) సినిమా వల్లే తనకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందని పూజా హెగ్డే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

పూజా హెగ్డే కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇం్దియా ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీ అవుతున్నారు.పూజా హెగ్డే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటింది.ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీస్, డాటర్ సెంటిమెంట్ మూవీస్, హ్యారీ పోటర్ లాంటి సినిమాలలో నటించాలని ఉందని ఆమె పేర్కొన్నారు.








