ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో సంక్రాంతికి వస్తున్నాం (sankrantiki vastunnam)మూవీ ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టింది.
ఈ సినిమా ఓటీటీ (OTT)హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వచ్చే వారం నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో(Zee5 OTT) స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటన వచ్చేసింది.
డేట్ చెప్పకపోయినా వచ్చే వారం అంటే ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ వెర్షన్ (OTT version)కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.జీ5 ఓటీటీ నిర్వాహకులు ఒకింత ఎక్కువ మొత్తం ఖర్చు చేసి సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ రైట్స్(Digital Rights) ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ రైట్స్ కోసం జీ5 ఒకింత భారీ మొత్తం ఖర్చు చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Aishwarya Rajesh, Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఖాతాలో ఎనిమిదో హిట్ గా ఈ సినిమా నిలవడం గమనార్హం.ఈ సినిమా సక్సెస్ తో అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ పెరిగిందని తెలుస్తోంది.అనిల్ రావిపూడి తర్వాత సినిమా చిరంజీవి హీరోగా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.ఇప్పటికే ఈ సినిమా కోసం ఆఫీస్ తీశారని త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని భోగట్టా.చిరంజీవి రెమ్యునరేషన్ 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







