టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ( Thaman )ఒకరు.బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ పని చేస్తుండటం గమనార్హం.టైర్1, టైర్2 స్టార్ హీరోలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా థమన్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల( Remuneration is Rs 5 Crores ) రేంజ్ లో ఉంది.థమన్ తాజాగా మాట్లాడుతూ ప్రస్తుతం అమ్మాయిలు ఇండిపెండెట్ అయ్యారని చెప్పుకొచ్చారు.
ఒకరి మీద ఒకరు బ్రతకాలని అనుకోవడం లేదని థమన్ పేర్కొన్నారు.సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువైందని థమన్ వెల్లడించారు.ఇన్ స్టాగ్రామ్ వాడకం కూడా ఎక్కువైందని జనాల మైండ్ సెట్ కూడా మారిందని థమన్ పేర్కొన్నారు.కలిసి ఉండే ఆలోచనా ధోరణి మారిపోతుందని థమన్ పేర్కొన్నారు.
పెళ్లి చేసుకున్నా వెంటనే విడిపోతున్నారని థమన్ కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రస్తుతం నేను ఈ పెళ్లిళ్లు వేస్ట్ అంటున్నానని నన్ను ఎవరైనా సలహా అడిగితే మాత్రం నేను పెళ్లి వద్దని చెబుతానని థమన్ వెల్లడించారు.ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి క్యాంప్ కోసం థమన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం గమనార్హం.ఈ నెల 15వ తేదీన థమన్ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో( Indira Gandhi Municipal Stadium ) మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించనున్నారు.

లైఫ్ లో దేనినైన నిలబెట్టవచ్చని ట్రస్ట్ నిలబెట్టడం మాత్రం కష్టమని థమన్ తెలిపారు.ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు ఎంతోమందికి స్పూర్తివంతులు అని థమన్ పేర్కొన్నారు.వాళ్ల ట్రస్ట్ కార్యక్రమంలో నేను పాల్గొనడం సంతోషంగా ఉందని థమన్ కామెంట్లు చేయడం గమనార్హం.ఈవెంట్ లో ఉత్తమ పాటలు ఉంటాయని మా టీమ్ మెంబర్స్ ప్రిపేర్ అవుతున్నామని థమన్ వెల్లడించారు.







