కాంగ్రెస్ లో చేరిన మిగతా ఎమ్మెల్యేలపైనా బీఆర్ఎస్ మైండ్ గేమ్ 

బీఆర్ఎస్( BRS ) నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి( MLA Krishna Mohan Reddy ) మళ్ళీ బీఆర్ఎస్ లో చేరడంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన మిగతా ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్రారంభించింది.

 Brs Mind Game On Other Mlas Who Joined Congress, Brs , Congress, Brs Mla's, Tel-TeluguStop.com

పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి వెనక్కి రాబోతున్నారంటూ ప్రచారం మొదలు పట్టింది .ఈ మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.రకరకాల కారణాలతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని,  మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని , ఈ మేరకు సంప్రదింపులు చేస్తున్నారనే ప్రచారాన్ని ఒకవైపు చేస్తూనే, మరోవైపు అనే రాజకీయ వ్యూహాల్లో నిమగ్నం అయ్యారు .భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని( MLA Tellam Venkatravuni ) టీ తాగేందుకు పిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్న ఫోటోను బయటకు పంపించారు.  దీంతో ఆయన కూడా మళ్లీ కాంగ్రెస్ ను విడి బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది.

Telugu Brsmind, Brs Mlas, Congress, Mlakrishna, Telangana-Politics

ఇదే జాబితాలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య( Chevella MLA Kale Yadayah ) పేరును కూడా చేర్చారు .దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు.తాము కాంగ్రెస్ ను వీడేది లేదని , పార్టీలోనే కొనసాగుతామని , తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు వివరణ ఇచ్చారు.

స్నేహపూర్వకంగా టీ తాగేందుకు పిలిస్తే వెళ్దామని, కానీ కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రచారం చేయించడం కరెక్ట్ కాదని , ఆ పార్టీలో ఉన్న నేతపై అదే పార్టీలో ఉన్న పెద్దలకు అనుమానం కలిగేలా చేయడం కూడా రాజకీయ వ్యూహంలో భాగంగానే అనే విషయం అర్థం అవుతోంది.  కాంగ్రెస్ ( Congress )లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ మైండ్ గేమ్ మొదలు పెట్టింది.

Telugu Brsmind, Brs Mlas, Congress, Mlakrishna, Telangana-Politics

బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారనే దానిపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొంది.తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పడిన పిటిషన్ పై విచారణ లాయర్ ను గతంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది.ఆయన కాంగ్రెస్ లో చేరడంతో లాయర్ ను తప్పించారు.ఇప్పుడు లాయర్ ను కొనసాగించాలని కేటీఆర్ ను కోరానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు.అయితే కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల్లో కృష్ణమోహన్ రెడ్డి ఇమడలేకపోయారు అని, ఆయన డిమాండ్లను కూడా కాంగ్రెస్ నెరవేర్చే విషయంలో అంత ఆసక్తి చూపించకపోవడంతోనే కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్  గూటికి చేరారు అనే ప్రచారం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube