సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో చాలామంది నటీనటులు వేర్వేరు కారణాల వల్ల పేర్లను మార్చుకున్నారు.కొంతమంది సెలబ్రిటీలకు పేరు మారిన తర్వాత లక్ కలిసొస్తే మరి కొందరికి మాత్రం పేరు మారినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
చిరంజీవి, రజనీకాంత్, నయనతార, అనుష్క సైతం పేర్లను మార్చుకున్న హీరో హీరోయిన్ల జాబితాలో ఉన్నారు.తాజాగా కొంతమంది సెలబ్రిటీలు పేర్లు మార్చుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఆకాశ్ పూరీ( Akash Puri ) తన పేరును ఆకాశ్ జగన్నాథ్ గా మార్చుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.పేరు మార్చుకున్న ఆకాశ్ తన పేరు వెనుక మార్పుకు కారణం మాత్రం చెప్పలేదు.
సాయి ధరమ్ తేజ్ మొదట తన పేరును సాయితేజ్ గా మార్చుకుని ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు.తన తల్లి పేరు దుర్గ కాగా ఆమె పేరును సాయితేజ్ తన పేరులో చేర్చుకున్నారు.
స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్( Samyuktha Menon ) కొన్నిరోజుల క్రితం తన పేరులో మీనన్ ను తొలగించుకున్నారు.తల్లీదండ్రులు విడిపోవడం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.ప్రేమలు హీరోయిన్ మమితా బైజు ( Mamitha Baiju )అసలు పేరు నమిత కాగా బర్త్ సర్టిఫికెట్ లో పొరపాటు వల్ల ఆమె ఇదే పేరును కొనసాగించడం జరిగింది. అడివి శేష్ అసలు పేరు శేష సన్నీ చంద్ర కాగా తన పేరులో సన్నీ ఉండటంతో అడివి శేష్ పేరును మార్చుకున్నారు.
యంగ్, టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen )అసలు పేరు దినేశ్ నాయుడు కాగా న్యూమరాలజీ, మరికొన్ని ఇతర కారణాల వల్ల హీరో విశ్వక్ సేన్ తన పేరును మార్చుకోవడం జరిగింది.అయితే పేర్లను మార్చుకున్న సెలబ్రిటీలలో ఎక్కువ మంది సెలబ్రిటీలకు కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.