పృధ్విరాజ్ కెరియర్ లో అద్భుతమైన 8 సినిమాలు..ఇవే తప్పక చూడండి

సలార్ సినిమా విజయవంతమైన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పృథ్విరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ) గురించి మాట్లాడుకునేవారు ఎక్కువయ్యారు.నిజానికి మలయాళ నుంచి వచ్చిన ఈ నటుడు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు.

 Prudhviraj Sukumaran 8 Best Movies ,prithviraj Sukumaran , Aadujeevitham ,cla-TeluguStop.com

చాలామంది నటీనటులు ఇండస్ట్రీకి వస్తుంటారు పోతుంటారు కానీ పాతుకు పోవడానికి వచ్చాడు అన్నట్టుగా పృథ్వీరాజ్ నటన అలాగే సినిమా సెలక్షన్ ఉంటుంది.ఆయన తన కెరియర్ లో ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించగా ఇప్పటి వరకు కెరియర్ లో పృథ్వీరాజ్ కి బెస్ట్ గా ఉన్న ఒక ఎనిమిది సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Aadujeevitham, Classmates, Jana Gana Mana, Mumbai-Movie

గోట్ లైఫ్ ( Aadujeevitham )పేరుతో వచ్చిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దుబాయ్ కువైట్ వంటి దేశాలు ఇరుక్కుపోయి అష్ట కష్టాలు పడ్డ ఒక వ్యక్తి కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రాగా, దీన్ని షూట్ చేయడానికి ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకున్నారు.కానీ చివరికి ఆ సినిమా విజయవంతమైన తీరు చూసి యావత్ భారతదేశం మొక్కున వేలేసుకుంది.ఇక ఆయన నటించడం మరొక సినిమా 2013లో వచ్చిన మెమోరీస్.పోలీస్ ఆఫీసర్ పాత్రలో వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి ఎలా కనిపెట్టారు అనే కథతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయింది.

ఇక ముంబై పోలీస్ అనే సినిమా సైతం అది కెరియర్లో కచ్చితంగా చెప్పుకోదగ్గ సినిమా.ఈ సినిమా సైతం 2013లోనే వచ్చింది.ఈ చిత్రంలో ఎసిపి ఆంటోనీగా పృథ్విరాజ్ సుకుమారన్ నటన అద్భుతం అని చెప్పొచ్చు.

Telugu Aadujeevitham, Classmates, Jana Gana Mana, Mumbai-Movie

2012లో వచ్చిన ఆయాలుం ఎంజనుం తమిళ్ అనే చిత్రం పృథ్వీరాజ్ కెరియర్ లో ఒక అద్భుతమైన మూవీ.ఇందులో డాక్టర్ పాత్రలో పృథ్వీరాజ్ నటన అమోఘం.ఇక 2006లో క్లాస్మేట్స్( Classmates ) అనే ఒక చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాలేజ్ అయిపోయిన తర్వాత పదేళ్లకు కలిసిన ప్రేమికుల మరియు స్నేహితుల కథ ఈ చిత్రం.

ఇక 2020లో కోవిడ్ టైంలో సైతం పృథ్వీరాజ్ నటించిన ఒక సినిమా విడుదల అయింది అది అయ్యప్పను కోషియం.ఈ సినిమా తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో విడుదలయింది.2022లో జనగణమన( Jana Gana Mana Movie ) అనే ఒక సినిమా రాగా అందులో పృథ్వీరాజ్ తో పాటు మమత మోహన్ దాస్ నటించిన ఈ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది.ఎక్కువగా పోలీస్ పాత్రులు ధరించిన పృథ్విరాజ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా పికెట్ 43.

కాశ్మీర్లో ఒంటరిగా ఉన్న ఒక ఇండియన్స్ సోల్జర్ పాకిస్తాన్ సోల్జర్ తో ఎలా స్నేహం చేశాడు అనే కథతో ఈ చిత్రం వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube