ఏ ఇండస్ట్రీ అయిన సరే ఖచ్చితంగా పార్టీలు జరుగుతూనే ఉంటాయి.సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం పూట ప్రతి ఒక్కరూ పార్టీలు చేసుకుంటూ మునిగిపోతూ ఉంటారు.
అది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితి.అందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అతీతమేమీ కాదు.
అలా చాలాసార్లు సినిమా పూర్తయిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటారు సదరు సినిమా నటి నటులు.అయితే మనకు తెలిసిన కొంతమంది స్టార్స్ అలా పార్టీలు, పబ్బులు అంటూ తిరిగే బ్యాచ్ కాదు.మరి వారు ఎవరు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అనసూయ
యాంకర్ గా మొదలుపెట్టి ఆర్టిస్టుగా ప్రస్తుతం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటి అనసూయ( Anasuya Bharadwaj ).తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన రూటే సపరేట్ అంటుంది.షూటింగ్ పూర్తి అయితే పార్టీకి వెళ్లాలా ఏంటి అంటూ మొహం మీద అడిగేస్తుంది కడిగేస్తుంది కూడా.తన పని ఏంటో తాను చూసుకుంటూ సినిమా కోసం మాత్రమే పని చేస్తానని చెబుతుంది ఈ అమ్మడు.
నేహా శర్మ
చిరుత సినిమా(Chirutha )తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అయితే అప్పట్లో పార్టీలకు వెళ్ళకపోతే ఏ సినిమా అవకాశాలు రావు అంటూ ఆమెను బాగా భయపెట్టారట.దాంతో కొన్నాళ్ళు ప్రయత్నించిన ఆమెకు అస్సలు నచ్చకపోవడంతో పార్టీ అంటే చిరాకు కలుగుతుంది ఈ అమ్మడుకి.అందుకే ప్రస్తుతం ఎలాంటి పార్టీలకు వెళ్లడం లేదట.
రాకేష్ మాస్టర్
తాగుతూనే తన జీవితాన్ని కోల్పోయారు రాకేష్ మాస్టర్.అయితే రాకేష్ మాస్టర్ కి మొదట్లో తాగుడు అలవాటు అస్సలు ఉండేది కాదట చాలామంది సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ కి వెళ్దామని పిలిచినా కూడా వెళ్లేవాడు కాదట అందుకే అతడికి మెల్లిగా ఇండస్ట్రీలో అవకాశాలు కూడా తగ్గాయట.అయినా కూడా ఏ రోజు మందు ముట్టుకొని ఆ వ్యక్తి ఆ తర్వాత రోజుల్లో తాగుడుకు బానిస అయ్యే కళ్ళు మూశారు.అంతలా మార్చేసింది ఈ పరిశ్రమ.