విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హీరోగా నటించిన మహారాజ సినిమా థియేటర్లలో హిట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాయి.
స్క్రీన్ ప్లే సరికొత్తగా రాయడంతో ఈ సినిమా అంచనాలను మించి మెప్పించింది.నిథిలన్ స్వామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ సినిమా చూసి దర్శకుడిని ప్రశంసించారు.
నిథిలన్ స్వామినాథన్( Nithilan Saminathan ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను విజయ్ అన్నను కలవడానికి వెళ్లిన సమయంలో చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు.నా భయాన్ని చూసి ఆయన నవ్వుతూ కూల్ గా ఉండు అన్నారని నిథిలన్ వెల్లడించారు.ఆ మాటతో నా భయం మొత్తం పోయిందని సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని ప్రశంసించారని నిథిలన్ పేర్కొన్నారు.
లియో సినిమా గురించి కూడా మా మధ్య చర్చ జరిగిందని నిథిలన్ తెలిపారు.
ప్రస్తుతం విజయ్ ది గోట్ సినిమా( THE GOAT )తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.సెప్టెంబర్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ది గోట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఆగష్టు నెల 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ రానుందని భోగట్టా.విజయ్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో బిజీ కానున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించే అవకాశం లేదు.
విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా విజయ్ తర్వాత ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.