ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి, నల్ల మచ్చలను వదిలించుకోవడానికి చాలా మంది బ్లీచింగ్ ట్రీట్మెంట్ ను ఎంచుకుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ బ్లీచింగ్ ఉత్పత్తుల్లో ఎన్నో కెమికల్స్ నిండి ఉంటాయి.
వాటిని వినియోగించడం వల్ల చర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.అందుకే కెమికల్ బేస్డ్ బ్లీచింగ్ ట్రీట్మెంట్ కు బదులు నేచురల్ పదార్థాలను బ్లీచింగ్ ఏజెంట్స్ గా ఉపయోగించాలని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.
బ్లీచింగ్ ట్రీట్మెంట్ కోసం సహజ పదార్ధాలను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.పైగా కోరుకున్న ప్రయోజనాలన్నీ లభిస్తాయి.
అయితే అలాంటి ఒక నేచురల్ స్కిన్ వైట్నింగ్ బ్లీచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక టమాటో తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక బంగాళదుంప తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి.
చివరిగా సరిపడా టమాటా బంగాళదుంప జ్యూస్ కూడా వేసి మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్‌ను అప్లై చేసుకోవాలి.ఈ నేచురల్ స్కిన్ వైట్నింగ్ బ్లీచ్ ను వారంలో రెండు సార్లు ట్రై చేస్తే కనుక చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.
చర్మం పై ఏర్పడిన మచ్చలు క్రమంగా మాయమవుతాయి.మరియు చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ సైతం వదిలిపోతాయి.







