ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే మోకాళ్ళ నొప్పులు ఉండేవి.కానీ ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కోట్లాది మంది మోకాళ్ళ నొప్పులతో మదన పడుతున్నారు.
మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువ దూరం నడవలేరు.నిలబడలేరు.
మెట్లు ఎక్కడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు.అలాగే ఒక్కోసారి మోకాళ్ళ నొప్పుల వల్ల రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర కూడా ఉండదు.
ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం పెయిన్ కిల్లర్స్( Pain killers ) ను వాడుతుంటారు.
కానీ వాటిని తరచూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే లడ్డూను రోజుకు ఒకటి తింటే మోకాళ్ళ నొప్పులకు సహజంగానే గుడ్ బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పులు రాగి ఫ్లెక్స్( Copper flakes ) వేసి దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి.
చివరిగా అరకప్పు బాదం ను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న రాగి ఫ్లెక్స్, కొబ్బరి పొడి( Coconut powder ) మరియు బాదం ను వేసుకోవాలి.అలాగే ఒక కప్పు గింజ తొలగించిన ఖర్జూరాలు, మూడు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని ఒక బాక్స్ లో నింపుకోవాలి.
ఈ లడ్డూలను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున ప్రతి రోజు తీసుకోవాలి.

దాంతో ఎముకల సాంద్రత పెరుగుతుంది.బలహీనమైన ఎముకలు బలంగా మారుతాయి.ఫలితంగా మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి.మోకాళ్ళ నొప్పులను నివారించడానికి ఈ హెల్తీ లడ్డూలు ఎంతో బాగా సహాయపడతాయి.అంతేకాదు లడ్డూలను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.
మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.