ఉసిరి దీనినే ఆమ్ల, శ్రీఫలం, ధాత్రీఫలం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.కాస్త పుల్లగా, కాస్త వగరుగా ఉండే ఈ ఉసిరికాయల్లో అనేక పోసకాలు నిండి ఉంటాయి.
అందుకే ఉసిరిని సర్వరోగ నివారిణి అని పిలుస్తుంటారు.కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా సౌందర్య పరంగానూ, కేశ సరంక్షణలోనూ ఉసిరి ఉపయోగపడుతుంది.
అందు వల్లనే, ఉసిరిని తరచూ తీసుకుంటూ ఉండాలి.అయితే ఎండ బెట్టిన ఉసిరిని తిన్నా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చని అంటున్నారు ఆరోగ్యానికి నిపుణులు.
మరి ఆలస్యం చేయకుండా ఎండబెట్టిన ఉసిరిని ఎలా తీసుకోవాలి.? అలా తీసుకుంటే వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
ఈ ఉసిరి ముక్కలను రోజుకు రెండు, మూడు చప్పున బాగా నమిలి తినాలి.ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ముఖ్యంగా మధుమేహం వ్యాధితో ఇబ్బంది పడే వారు ఎండబెట్టిన ఉసిరిని రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అలాగే ఎండబెట్టిన ఉసిరిలోనూ విటమిన్ సి మరియు యాంటీ అక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.అందువల్ల, ఎండిన ఉసిరి ముక్కలను రోజూ రెండు చొప్పున తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.మలబద్ధకంతో బాధ పడే వారికి సైతం ఎండబెట్టిన ఉసిరి ఓ ఔషధంలా పని చేస్తుంది.
భోజనం తర్వాత రెండు, మూడు ఉసిరి ముక్కలను బాగా నమిలి గోరు వెచ్చని నీటిని తాగాలి ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారి మలబద్ధకం పరార్ అవుతుంది.
అంతేకాదు, ఎండ బెట్టిన ఉసిరి రెగ్యులర్‌గా తీసుకుంటే గనుక ఎముకలు దృఢంగా మారి ఆర్థరైటిస్ నొప్పులు తగ్గు ముఖం పడతాయి.
జలుబు, దగ్గు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.కంటి చూపు పెరుగుతుంది.
ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి దూరమవుతాయి.మరియు హెయిర్ ఫాల్ నుంచి సైతం విముక్తి లభిస్తుంది.