టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.అల్లు వారసుడిగా గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ తన లుక్ పరంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇలా తన లుక్ పట్ల ఎన్నో విమర్శలు రావడంతో కాస్త సమయం తీసుకున్న అల్లు అర్జున్ అనంతరం ఆర్య సినిమా ద్వారా సరికొత్త లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.ఇలా ఆర్య సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
సుకుమార్ ( Sukumar )డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా( Pushpa ) ద్వారా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇలా కెరియర్ పట్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ గురించి ఆయన సర్జరీ( Surgery ) ల గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
అల్లు అర్జున్ అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకున్నారు అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకోవడం సర్వసాధారణం.అయితే అల్లు అర్జున్ కి జరిగిన సర్జరీ ల గురించి ప్రముఖ డాక్టర్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ప్రముఖ సర్జరీ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ కు గతంలో అల్లు అర్జున్ ఫోటోలను చూపించగా ఈయన తన అందం కోసం ముక్కు( Nose ) అలాగే పెదాలకు( Lips )సర్జరీ చేయించుకున్నారని వెల్లడించారు.
ఇలాంటి సర్జరీలు ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చేయించుకోవడం సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు.