హెయిర్ ఫాల్ నుంచి డ్రై హెయిర్ వరకు అన్నిటికీ చెక్ పెట్టే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక జుట్టు సమస్య( Hair Problem )తో స‌త‌మ‌తం అవుతూనే ఉంటారు.హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ లేకపోవడం, హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్, చుండ్రు ఇలా రకరకాల సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి.

 A Magical Remedy That Checks Everything From Hair Fall To Dry Hair!, Magical Rem-TeluguStop.com

వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియక నానా తంటాలు పడుతుంటారు.అయితే హెయిర్ ఫాల్ నుంచి డ్రై హెయిర్ వరకు అన్ని సమస్యలకు చెక్ పెట్టే మ్యాజికల్ రెమెడీ ఒకటి ఉంది.

ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Dandruff, Dry, Damage, Fall, Pack, Problems, Hibiscus, Hibiscus Pack, Rem

మందారం పువ్వులు( Hibiscus ). దాదాపు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి.వీటితోనే మనం అనేక జుట్టు సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

మందారం పూలు కేవలం అలంకరణకు మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం ఎంతగానో సహాయపడతాయి.మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు ఫ్రెష్ మందారం పువ్వుల రేకులను వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే బోలెడు లాభాలు పొందవచ్చు.మందారం జుట్టు కుదుళ్ళను బలపరుస్తుంది.

హెయిర్ గ్రోత్( Hair Growth ) ను ప్రమోట్ చేస్తుంది.ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే మందారం లో ఉండే పోషకాలు హెయిర్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి.

Telugu Dandruff, Dry, Damage, Fall, Pack, Problems, Hibiscus, Hibiscus Pack, Rem

మందారం ఒక న్యాచుర‌ల్ కండిషనింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది.దాంతో మందారాన్ని జుట్టుకు రాయడం వల్ల డ్రై హెయిర్ సమస్య( Dry Hair Problem )ను సులభంగా ఎదుర్కోవచ్చు.జుట్టును సిల్కీగా, షైనీగా( Silky Shiny Hair ) మెరిపించుకోవచ్చు.

అంతేకాదు మందారంలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.ఇవి చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడతాయి.

చుండ్రు సమస్యను సమర్థవంతంగా అరికడతాయి.పైగా మందారం జుట్టు త్వరగా తెల్ల పడకుండా సైతం అడ్డుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube