వాటికే జీవితాన్ని త్యాగం చేసిన పుణ్యాత్మురాలు అమ్మ.. బాలయ్య ఎమోషనల్ కామెంట్స్!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ( Actor Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Balakrishna Open Up About His Mother Basavatarakam And Emotional Comment, Balakr-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఇటీవల మూడు సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.

కాగా బాలయ్య బాబు ఎప్పుడు మాట్లాడినా కూడా ఎప్పుడూ నాన్న ఎన్టీరామారావు గురించే మాట్లాడతారు.కానీ అమ్మ బసవతారకం( Basavatarakam ) గురించి చెప్పింది మాట్లాడింది చాలా తక్కువ.

కానీ తాజాగా ఆమె గురించి రియాక్ట్ అవుతూ ఎమోషనల్‌ అయ్యాడు బాలయ్య బాబు.సినిమాల్లో, రాజకీయాల్లో ఎక్కువగా ఎన్టీ.రామారావు( NT Rama Rao ) ప్రస్తావనే వస్తుంది.ఆయన సినిమాలు, ఆయన రాజకీయం గురించే అంతా మాట్లాడుకుంటారు.

ఆ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ, కూతుళ్ల గురించి చర్చ, ప్రస్తావన వస్తూ ఉంటుంది.కానీ ఎన్టీఆర్‌ భార్య బసవతారకం గురించిన ప్రస్తావన చాలా తక్కువ.

ఇంకా చెప్పాలంటే అరుదు అనే చెప్పాలి.కానీ ఎన్టీఆర్‌ సక్సెస్‌ వెనుక ఆమెనే ఉన్నారు.

ఆయన సినిమాల్లో బిజీగా ఉంటే ఫ్యామిలీ చూసుకోవడమైనా, ఎన్టీఆర్‌ని అన్ని విధాలుగా చూసుకోవడంలో అయినా బసవతారకం కీలక భూమిక పోషించారు.

బసవతారకం అంటే రామారావుకి కూడా ఎంతో ప్రేమ.

అందుకే ఆమె కోసం ఆమె పేరుతోనే బసవతారకం ఆసుపత్రిని కూడా కట్టించారు.ఆమె 1984లో క్యాన్సర్‌తో చనిపోయిన నేపథ్యంలో ఎవరూ అలా చనిపోకూడదని ఆసుపత్రి కట్టించారు రామారావు.

ఇదిలా ఉంటే తన అమ్మ గురించి బాలకృష్ణ స్పందించారు.ఇలా మీడియా ప్రముఖంగా అమ్మ గురించి చెప్పడం అరుదు అనే చెప్పాలి.

అమ్మ గురించి చెబుతూ, ఆయన ఎమోషనల్ అయ్యారు.బసవతారకం కూడా ఎన్టీఆర్‌ తోనే మద్రాస్‌లోనే ఎక్కువగా ఉండేదట.

బాలకృష్ణ, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు అంతా హైదరాబాద్‌లో పెరిగారట.అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటారట.

అయితే నాన్న ఎన్టీఆర్‌ది గెస్ట్ అప్పీయరెన్స్ అని, అప్పుడప్పుడు వస్తుంటే చూడటమే అని, ఎక్కువగా సినిమాల్లోనే చూసేవాళ్లమని చెప్పారు బాలయ్య బాబు.

Telugu Balakrishna, Basavatarakam-Movie

అమ్మ కూడా నాన్నతో పాటు మద్రాస్‌లో ఉండటంతో ఆమె కూడా తక్కువగానే ఉండేదని, కానీ ఆ తర్వాత తమని ఎక్కువ టేక్‌ కేర్‌ చేసిందని తెలిపారు బాలయ్య.అమ్మగారు కూడా నాన్నతోపాటు మద్రాస్ లోనే ఉండేవాళ్లు.ఇక్కడికి రావడం చాలా తక్కువ.

మేం హైదరాబాద్‌లో ఉండేవాళ్లం.ఆమె నాన్న గారికే తన జీవితాన్ని అంకితం చేసింది.

ఆయన మార్నింగ్‌ మూడు గంటలకు లేస్తే, రెడీ అయ్యే లోపు టిఫిన్స్ రెడీ చేసి పెడుతుంది.మళ్లీ సాయంత్రం నాన్న షూటింగ్‌ నుంచి వచ్చేటప్పుడు సడెన్‌గా నాకు ఇది చేసి పెట్టు అంటే ఆయన వచ్చే లోపు ఆ వంటకాలు రెడీ చేసి పెట్టేది.

Telugu Balakrishna, Basavatarakam-Movie

నాన్నకి అమ్మ చేత్తోనే చేసి పెట్టాలి.అమ్మ చేతి వంటే ఇష్టంగా తింటాడు.ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటదంటారు.అలా నాన్న వెనుక అమ్మ జీవితం ఉంది.

అంతేకాదు ఇంత మంది పిల్లలను కనింది.ఆల్మోస్ట్ మేం 13 మంది పిల్లలను కన్నది అమ్మ.

అది ఎంతో పెయిన్‌.ఇలా అన్నీ చూసుకుంటే పాపం జీవితాంతం ఆమె నాన్న కోసం, కుటుంబం కోసం త్యాగం చేసిన ఒక పూణ్యాత్మురాలు.

అన్ని సద్గుణాలు కలగలిపిన ఒక మహోన్నతమైన వ్యక్తి అమ్మగారు అంటూ ఎమోషనల్‌ అయ్యారు బాలయ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube