మైగ్రేన్ తలనొప్పిని భరించటం చాలా కష్టం.తలకు ఒక వైపుకు మాత్రమే వచ్చే ఈ నొప్పి కొందరికి పార్శ్వ భాగానికే మాత్రమే పరిమితం అవుతుంది.
మరికొందరికి తల మొత్తం వస్తుంది.తల మీద సుత్తితో కొట్టినట్టు ఉండటం, ముక్కు చుట్టూ ఎదో కదులుతూ ఉన్నట్టు అన్పించటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ బాధ నుండి ఉపశమనానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడుతూ ఉంటారు.అయితే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి.
అందువల్ల మైగ్రేన్ తలనొప్పిని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.వాటి గురించి తెలుసుకుందాం.
తాజా ద్రాక్ష రసాన్ని త్రాగితే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.రోజులో రెండు సార్లు త్రాగాలి.దాల్చినచెక్క మెగ్రైన్ తలనొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.దాల్చినచెక్క పొడికి నీటిని కలిపి పేస్ట్ చేసి నుదురు మీద రాయాలి.
అరగంట అయ్యాక వేడి నీటితో కడగాలి.ఈ విధంగా రోజులో రెండు నుంచి మూడు సార్లు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది కెఫీన్ కూడా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది.
అందువల్ల రోజులో రెండు సార్లు కాఫీ లేదా టీ త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
![Telugu Ginger, Grape, Benefitsginger, Tips, Migraine-Telugu Health Telugu Ginger, Grape, Benefitsginger, Tips, Migraine-Telugu Health]( https://telugustop.com/wp-content/uploads/2022/03/Ginger-good-health-health-Health-Tips.jpg)
అల్లం ఒంటి నొప్పులను తగ్గించటమే కాకుండా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.అల్లం రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకొని త్రాగవచ్చు.లేదా అల్లం టీ తయారుచేసుకొని త్రాగవచ్చు.
వెలుతురు ఎక్కువగా ఉన్న ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.అందువల్ల లైట్స్,ఆఫ్ చేసి చీకటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటానికి మంచి సమర్ధవంతమైన మార్గం మసాజ్ చేయటం.తల, మెడ భాగాలలో నెమ్మదిగా మసాజ్ చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.