సాధారణంగా ఒక సినిమా టైటిల్ అనేది కథకు తగినట్లుగా ఉండాలి.ఆ టైటిల్ చూస్తేనే ప్రేక్షకులు సినిమాపై ఇంట్రెస్ట్ కలగాలి.
ఈ విషయంలో దర్శకులు నిర్మాతలు హీరోలు చాలా సమాలోచనలు చేస్తారు.అయితే కొంతమంది దర్శకులు మాత్రం వేరే వాళ్ళు చెప్పిన పేరును తమ సినిమాలకు టైటిల్స్ పెట్టుకున్నారు.
వాళ్లెవరో ఆ సినిమా టైటిల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.కొద్ది రోజుల క్రితం అన్‌స్టాపబుల్ సినిమాలో గోపీచంద్ ప్రభాస్‌తో కలిసి పార్టిసిపేట్ చేశారు.
ఈ షోలో ఆయన మాట్లాడుతూ తన అప్‌కమింగ్ సినిమా గురించి చెప్పారు.అయితే ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్ పెడితే బాగుంటుందని హోస్ట్ బాలకృష్ణ సూచించారు.
దాంతో గోపీచంద్ తన నెక్స్ట్ మూవీకి అదే పేరు పెట్టారు.

రామబాణం సినిమా( Ramabanam )కు భూపతి రాజా కథ అందించగా, శ్రీవాస్ దర్శకత్వం వహించారు.ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో గోపీచంద్, డింపుల్ హయతి, జగపతి బాబు, నాసర్, వెన్నెల కిషోర్, తరుణ్ అరోరా, సచిన్ ఖేడేకర్లు నటించారు.సౌండ్‌ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మిక్కీ జె.మేయర్ కంపోజ్ చేశారు.రామబాణం గతేడాది మే 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.

డీజే సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ గా డీజే టిల్లు పార్ట్ 2( Tillu Square ) వచ్చింది.అయితే ఈ మూవీకి ఏ పేరు పెడదామని మేకర్స్ చాలా ఆలోచించారు.“టిల్లు స్క్వేర్” అనే పేరు పెడితే బాగుంటుందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా ఇచ్చారు.ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ టైటిల్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.DJ టిల్లు ఒక రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్, ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు.
విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో జొన్నలగడ్డ టైటిల్ క్యారెక్టర్‌లో నటిస్తే నేహా శెట్టి, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.
టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.భవిష్యత్తులో మరి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయో చూడాలి.
అసలైతే వేరే వాళ్ళు చెప్పిన పేర్లను పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ఒప్పుకోరు కానీ బాగుంటే మాత్రం పెట్టుకుంటారని ఈ ముగ్గురు సినిమా వాళ్ళు నిరూపించారు.







