1.నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం

నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఒరేయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2.ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ
నేడు ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మరోసారి రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ జరగనుంది.
3.జయలలిత మృతి పై విచారణ పూర్తి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి విచారణ పూర్తయింది .ఈ నివేదికను సీఎం స్టాలిన్ కు రిటైర్డ్ జడ్జి ఆర్మూగ స్వామి అందించనున్నారు.
4.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,520 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.రాజాసింగ్ రిమాండ్ ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ చేసేందుకు నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
6.పులుల సంచారం
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో పులుల సంచారం కలకలం రేపుతోంది.ఘన్పూర్, మందూరు అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
7.చంద్రాయన గుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం

చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను హోం మంత్రి మహమ్మద్ అలి ప్రారంభించారు.
8.హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
రేపు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ నుంచి జిఎంసి బాలయోగి స్టేడియం వరకు ఆదివారం నిర్వహించే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
9.బండి సంజయ్ సభకు హైకోర్టు అనుమతి

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సభకు హైకోర్టు అనుమతించింది.
10.శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
11.విజయనగరం జిల్లాలో పులి భయం

విజయనగరం జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తుంది మూడు రోజులుగా పెద్దపులి తెర్లా మండలం గొలుగువలసలలు సంచరిస్తూ పశువులపై దాడికి దిగుతోంది.
12.రఘురామ కామెంట్స్
తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసిపి ప్రయత్నాలు చేసి విఫలమైందని ఇప్పుడు రాజీనామా చేయాలని కోరడం అర్ధ రహితమని వైసిపి ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఆ పార్టీ అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
13.ఘనంగా ఆలీ కూతురు ఎంగేజ్మెంట్

సినీ నటుడు ఆలీ కుమార్తె మహమ్మద్ ఫాతిమా రిమీజున్ ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది .ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
14.మిథిలిరాజ్ తో జేపీ నడ్డా భేటీ
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిదిలి రాజ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
15.నేడు రేపు భారీ వర్షాలు

తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
16.జేపీ నడ్డా పర్యటనపై కేటీఆర్ వెటకారం
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటర్లు వేశారు.నడ్డా చెప్పులు మోసేది ఎవరో అంటూ ఆయన వెటకారం చేశారు.
17.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
18.తుంగభద్ర ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో ప్రాజెక్ట్ కు ఉన్న 12 గేట్లను ఎత్తివేసి దిగువకు విడుదల చేశారు.
19.కొవ్వూరు అర్బన్ బ్యాంక్ కు త్రిసభ్య కమిటీ

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అర్భన్ బ్యాంక్ కు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,300 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,600
.






