మండిపోతోన్న అమెరికా.. మరీ ఈ రేంజులో ఉష్ణోగ్రతలా..?

కాలుష్యం, భూతాపం భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.అతి శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో భానుడు మాడు పగులగొడుతుండగా.

 Dangerous Heat Wave Engulfs United States, Weather Experts Predict Record Temper-TeluguStop.com

విపరీతమైన వేడి, ఎండ ఉండే గల్ఫ్ దేశాలను వరదలు , తుఫాన్లు ముంచెత్తుండటంతో నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.ఈ సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోని పక్షంలో మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Telugu Calinia, Valley, National, Portland-Telugu NRI

ఇకపోతే.ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచిన అమెరికా( America )లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా యూఎస్ వ్యాప్తంగా వేడి తరంగాలు వ్యాపిస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ ( National Weather Service )తెలిపింది.ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నేపథ్యంలో జనం చల్లని ప్రాంతాలకు క్యూ కడుతున్నారు.

వెస్ట్ కోస్ట్‌లో సగటు ఉష్ణోగ్రత 15 నుంచి 30 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య ఉండే అవకాశం ఉందని వెదర్ సర్వీస్ అంచనా వేసింది.వచ్చే వారం వరకు ఇదే విధమైన పరిస్ధితులు చోటు చేసుకుంటాయని పేర్కొంది.

Telugu Calinia, Valley, National, Portland-Telugu NRI

పోర్ట్‌లాండ్( Portland ) ప్రాంతంలో చివరిసారిగా 1941 జూలైలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు నమోదైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.2021లో ఇదే రకమైన పరిస్ధితులు తలెత్తగా ఒరెగాన్, వాషింగ్టన్, పశ్చిమ కెనడాలలో 600 మంది ప్రాణాలు కోల్పోయారు.అరిజోనాలోని మారికోపా కౌంటీలో ఈ ఏడాది కనీసం 13 మంది వేడి ఉష్ణోగ్రతల కారణంగా చనిపోయారు.డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌లోని ఫర్నేస్ క్రీక్ ఫోర్‌కాస్ట్ ప్రకారం ఆదివారం పగటిపూట గరిష్టంగా 129 ఫారిన్ హీట్ డిగ్రీలు, ఆపై బుధవారం 130 ఫారిన్ హీట్ డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

జూలై 1913లో డెత్ వ్యాలీ( Death Valley )లో 134 ఫారిన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ( భూమిపై నమోదైన అధ్యధిక ఉష్ణోగ్రతగా ప్రపంచ రికార్డు) నమోదయ్యాయి.జూలై 2021లో ఇక్కడ 130 ఫారిన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.

అరిజోనాలోని బుల్ హెడ్ సిటీలో శుక్రవారం ఉదయం 11 గంటల వరకు ఉష్ణోగ్రత 111 ఫారిన్ హీట్ డిగ్రీలకు చేరుకుందని అంచనా.ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులను శీతలీకరణ కేంద్రాలకు తరలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube