కార్తీకదీపం వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. అస్సలు నమ్మలేమంటూ?

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి ప్రేమి విశ్వ‌నాథ్( Premi Viswanath ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రేమి విశ్వ‌నాథ్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ వంటలక్క అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

 Karthika Deepam Premi Viswanath Son, Karthika Deepam, Premi Viswanath, Son, Toll-TeluguStop.com

స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం( Karthika deepam ) సీరియల్ తో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది వంటలక్క.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు భారీగా అభిమానులు ఉన్నారు.

అంతేకాకుండా ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.కార్తీకదీపం సీరియల్ బుల్లితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Telugu Karthika Deepam, Manujit, Premi Viswanath, Tollywood, Vineeth Bhatt-Movie

అంతేకాకుండా ఈ సీరియల్ రికార్డు స్థాయిలో టీఆర్పి రేటింగ్స్ ను సాధించింది.ఒక్క సీరియల్ తోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్.ఇకపోతే ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.ఈ సీరియల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీప అలియాస్ వంటలక్క.అయితే తెరపై వంటలక్క ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రేమీ విశ్వనాధ్ ఒక కుర్రాడుతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్ చేసింది.ఈ వీడియోని సదరు కుర్రాడే సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేశాడు.

Telugu Karthika Deepam, Manujit, Premi Viswanath, Tollywood, Vineeth Bhatt-Movie

మామ్ అండ్ సన్ అనే క్యాప్షన్ పెట్టాడు.దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అతున్నారు.ఎందుకంటే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్‌ కి పెళ్లయి పిల్లలు ఉన్నారని తెలుసు కానీ, మరీ ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని మాత్రం ఊహించలేకపోయారు.కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్.

వినీత్ భట్( Vineeth Bhatt ) అనే ఆస్ట్రాలజర్‌ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది.వీళ్లకు పుట్టిన అబ్బాయి పేరు మనుజిత్.

తాజాగా తల్లితో కలిసి చేసిన ఓ రీల్ షేర్ చేయగా అందరూ అవాక్కవుతున్నారు.ఎందుకంటే ఆరడుగుల పొడుగు సిక్స్ ప్యాక్ బ్యాడీతో చూడటానికి హీరోలా ఉన్నాడు.

దీంతో బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు.సంతూర్ మమ్మీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా వంటలక్కకు ఇంత పెద్ద కొడుకా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube