సివిల్ సర్వీస్( Civil Service ) చరిత్రలోనే మొదటిసారి సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.తాజాగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు చెందిన ఒక సీనియర్ అధికారి అన్ని అధికారిక రికార్డులలో తన పేరు తోపాటు లింగాన్ని మార్చుకున్న సంగతి అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ తరహా అభ్యర్థనకు కేంద్ర ఆర్థికమంత్రి శాఖ కూడా ఆమోదం తెలపడం జరిగింది.హైదరాబాదులోని కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం జాయింట్ కమిషనర్ (ఆథరైజ్డ్ రిప్రంజటేటివ్)గా పనిచేస్తున్న 30 సంవత్సరాల అనసూయ( Anusuya ) చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
దీంతో అనసూయ కాస్త అనుకతిర్ సూర్య గా మారిపోయింది.ఇన్ని సంవత్సరాలుగా మహిళ గా ఉన్నఅనుక తీర్ ఇకపై పురుషుడిగా కేంద్ర ప్రభుత్వం పరిగణించబోతుంది.గత సంవత్సరం నుండి హైదరాబాద్( Hyderabad ) లో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనసూయ విద్య అర్హతల విషయానికి వస్తే చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ పూర్తి చేశారు.ఉద్యోగంలో చేరిన అనంతరం భోపాల్‌లో నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పిజి డిప్లమాను పూర్తి చేశారు.
తాజాగా.అనసూయ కేంద్ర ఆర్థిక మంత్రివర్గ శాఖలో విడుదల చేసిన ఉత్తర్వులలో ‘‘ఎం అనుసూయ ఐఆర్ఎస్ (సీఅండ్ ఐటీ 2013.ఎంప్లాయీ కోడ్ 4623, డీఓబీ (పుట్టిన తేదీ) 20.10.1988) కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్, హైదరాబాద్.అభ్యర్ధన మేరకు ఆమె పేరు, లింగాన్ని అధికారిక రికార్డుల్లో ఎం అనుకతిర్ సూర్యగా మార్పునకు అమోదించాం’’ అంటూ తెలిపింది.
ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తామని ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మొత్తం పూర్తి అయిందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది.ఇది ఇలా ఉండగా.ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఒక సీనియర్ అధికారి ‘‘ఇది ఒక చరిత్రాత్మక పరిణామం.భారతీయ సివిల్ సర్వీసెస్‌లో లింగ గుర్తింపును పురోగతిని హైలైట్ చేస్తుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ప్రభుత్వ విభాగాల్లో లింగమార్పిడి వ్యక్తులను చేర్చుకోవడం, మద్దతుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.