వేణు స్వామి( Venu Swamy ) పరిచయం అవసరం లేని పేరు.ఈయన గత కొంతకాలంగా ప్రభాస్( Prabhas ) గురించి జాతకాలు చెప్పడమే కాకుండా ఆయన అభిమానుల వల్ల భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు.
ఈ విధంగా ప్రభాస్ సినిమాల గురించి జాతకాలు చెబుతూ ఇలా ట్రోల్స్ అవుతున్న వేణు స్వామి తాజాగా కల్కి సినిమా( Kalki Movie ) గురించి మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు కల్కి సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ సినిమా మంచి సక్సెస్ అయింది కదా మీ జాతకం తప్పయింది ఈ విషయంలో మీరు ఏమంటారని తెలిపారు.

తాను బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు సక్సెస్ కావని చెప్పాను.ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాదే శ్యామ్, ఆది పురష్ వంటి సినిమాలు సక్సెస్ కాలేదు మరి అప్పుడు ఎవరు అడగలేదని ప్రశ్నించారు.ఇక సలార్( Salaar ) హిట్ అయిందని అందరూ అనుకుంటున్నారు కానీ ఆ సినిమాకి కూడా 100 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి ఇక కల్కి సినిమా హిట్ అయిందా.
అసలు ఈ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్ ఎంతసేపు కనిపించారు అంటూ ఈ సినిమా గురించి కూడా మాట్లాడారు.

ఈ సినిమా కలెక్షన్లు ఎంత వచ్చాయి ఎంత లాభాలు ఉన్నాయి అనేది త్వరలోనే నిర్మాతలు కూడా తెలియజేస్తారని కల్కి సినిమా గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే వ్యక్తిగతంగా నాకు ప్రభాస్ కి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని తెలిపారు.ఆయన అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు.
ఇక మా తోటలో పండే పండ్లు కూడా మేము ప్రభాస్ కి పంపిస్తూ ఉంటాము మరి ఈ మధ్య నేను పెట్టుకున్న కళ్ళజోడు ప్రభాస్ కి బాగా నచ్చాయని తన మేనేజర్ ఫోన్ చేసి మరి వివరాలు తెలుసుకున్నారు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ తో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.