ఐబ్రోస్ అనేవి ముఖాన్ని అందంగా కనిపించడంలో కీ రోల్ పోషిస్తాయి.ఇవి ఎంత మందంగా ఉంటే మనం అంత అందంగా కనిపిస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐబ్రోస్ చాలా మందికి ఒకేలా ఉండవు.కొంతమందికి గుండ్రంగా ఉంటే మరికొంతమందికి హరివిల్లులా ఉంటాయి.
ఇంకాస్తా మంది థిక్‌గా ఉంటే మరికొంతమందికి పాపం ఉండనే ఉండవు.అలాంటి వారు ఏం చేస్తే ఐబ్రోస్ పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐబ్రోస్ ఒత్తుగా లేని వారు అంత ఆకర్షణీయంగా లేమని ఫీల్ అవుతారు.అలాంటప్పుడు కొన్ని ఆయిల్స్ రాయడం వల్ల ఐబ్రోస్ మందంగా పెరుగుతాయి.
మరి ఆ ఆయిల్స్ ఏమేం ఉన్నాయంటే.కొబ్బరి నూనె, ఆలీవ్ ఆయిల్.
ఈ రెండింటిని కొద్దికొద్దిగా మిక్స్ చేసి రాయడం వల్ల మందంగా ఐబ్రోస్ పెరుగుతాయి.ఐబ్రోస్ ఒత్తుగా పెరగడానికి ఇక్కడ ఓ సీక్రెట్ ఆయిల్‌ని తయారు చేసుకోవచ్చు.
దీని వల్ల ఐబ్రోస్ మందంగా పెరగడమే కాదు అందంగా కనిపిస్తాయి.
మరి ఆ సీక్రెట్ ఆయిల్ ఎలా తయారు చేయాలంటే.
ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి.తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆముదాన్ని కలపాలి.
ఇప్పుడు అదే మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని కలపాలి.ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల బాదం నూనె కలపాలి.
ఈ అన్ని నూనెల మిశ్రమాన్ని బాగా కలిపి ఓ గ్లాస్ జార్లో స్టోర్ చేయండి.ఈ నూనెతో మీ ఐబ్రోస్‌ని రోజూ రాత్రి పడుకునే ముందు 2 చుక్కలు వేసి మసాజ్ చేయండి.
ఇలా ఓ నెల పాటు చేయండి.వచ్చే తేడాని మీరే కనుక్కుంటారు.
ఇలా కొన్ని చిట్కాలు పాటించడం వల్ల అందమైన ఐబ్రోస్‌ని మీ సొంతం చేసుకోవచ్చు.అయితే ఇవన్నీ కలిపి రాయొచ్చు.
కొన్నిసార్లు ఆముదం రాయడం కూడా హెల్ప్ చేస్తుంది.అయితే, ఇది మరి జిడ్డుగా ఉంటుంది.
అందుకే రాత్రి పడుకునే ముందు రాసి ఉదయాన్నే కడిగేస్తే సరిపోతుంది.

వీటితో ఆముదం మరి ఇబ్బందిగా ఉంటే అందులో బాదం నూనె మిక్స్ చేసి కూడా రాయొచ్చు.అలానే పైన చెప్పిన ఆయిల్స్‌లో ఏదో ఒకటి కూడా ఎంచుకుని రాయొచ్చు.వీటితో పాటు వాజిలెన్ కూడా మీ ఐబ్రోస్‌ని అందంగా చేయడంలో మేలు చేస్తుంది.
ఇవి కేవలం ఐబ్రోస్ మాత్రమే కాదండి.ఐ లాషెస్ కనురెప్పలకి కూడా వాడొచ్చు.
అయితే ఏదైనా వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మరిచిపోవద్దు.ఎందకంటే కొన్ని పదార్థాలు కొంతమందికి పడవు.
అందుకే ముందుగా అలా చేయడం వల్ల ఏదైనా సమస్య వచ్చే ముందుగానే గుర్తించొచ్చు.అయితే కేవలం ఐబ్రోస్‌పై ఆయిల్ రాయడం మాత్రమే కాదు.
రాశాక మసాజ్ చేయడం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

ఇలా రెగ్యులర్‌గా మసాజ్ చేస్తుంటే మీ ఐబ్రోస్ కూడా ఒత్తుగా అందంగా పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి.అంతకు మించి అందానికంటే ఆత్మవిశ్వాసంగా ఉండడం కూడా మంచిదేనని మర్చిపోవద్దు.ఐబ్రోస్‌ను ఒత్తుగా మరియు నల్లగా పెంచడంలో గ్రేట్‌గా ఉల్లిపాయ రసం సహాయపడుతుంది.
అందువల్ల, ఉల్లిపాయల నుంచి ఉల్లి రసం తీసుకుని.ఐబ్రోస్ ప్రాంతంలో అప్లై చేయాలి.
రోజులో రెండు సార్లు ఉల్లి రసం అప్లై చేయాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే.
మీ ఐబ్రోస్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది.అలాగే మెంతులను బాగా నానబెట్టి.
పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ రాత్రి నిద్రించే ముందు కనుబొమ్మలకు ప్యాక్‌లా వేయాలి.
ఉదయం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా మంచి ఫలితం ఉంటుంది.