బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నాయకుల వలస పరంపర కొనసాగుతూనే ఉంది .ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, హరీష్ రావు , కేటీఆర్ లు ఇద్దరు ఢిల్లీలోనే గత వారం రోజులుగా మకాం వేయడం, ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) కు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఈ సందర్భంగా కాంగ్రెస్ పైన మీడియా సమావేశం నిర్వహించి విమర్శలు చేయడం వంటివ చోటు చేసుకుంటూ ఉండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో చాలామంది మాత్రం పార్టీ మారేందుకు ప్రణాళికను ముమ్మరం చేశారు.
ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ కాగా , మరి కొంతమందితో ఆ పార్టీలో చేరేందుకు మంతనాలు చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ అంశంపైనే ఢిల్లీలో కేటీఆర్ ( KTR )మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు.ఇదిలా ఉండగానే, కాంగ్రెస్ నుంచి వస్తున్న ఆఫర్లతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటువైపు మొగ్గుచూపుతున్నారట.ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , మంత్రులు తో పాటు, సీఎం రేవంత్( CM Revanth reddy ) తోనూ రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం.ఇప్పటికే కొంతమంది పార్టీ మారే ఆలోచనతో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కేసిఆర్ బుజ్జగిస్తున్నా.
ఫలితం కనిపించడం లేదట.బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్( BRS MLA Dr Sanjay ) కాంగ్రెస్ లో చేరిన దగ్గర నుంచి మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారట.
కేసీఆర్ , కేటీఆర్ హరీష్ రావు పూర్తిగా ఈ వ్యవహారాలపై ఫోకస్ పెట్టి, పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు పార్టీ మారకుండా చేయగలిగితేనే బిఆర్ఎస్ ఉనికికి ఏ డొఖా ఉండదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ను ఏవిధంగా కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావులు ఒడ్డున పడేస్తారనేది ఆసక్తికరంగా మారింది.కేసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి పూర్తిగా పార్టీ పై ఫోకస్ చేయకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలహీనం అవుతుందనడంలో సందేహం లేదు.