పవన్ సినిమాలో నటి అనసూయ.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన నటి?

జబర్దస్త్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ( Anasuya ) ప్రస్తుతం వెండితెర నటిగా వరుసు సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.ఇలా నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు.

 Anasuya Gives Clarity To Act In Pawan Kalyan Movie, Pawan Kalyan, Anasuya, Tolly-TeluguStop.com

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా వరుస సినిమాలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియా( Social media )లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

Telugu Anasuya, Ap, Og, Pawan Kalyan, Tollywood-Movie

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తనకు వీలు అయినప్పుడు సరదాగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఇటీవల అభిమానులతో చిట్ చాట్ చేసిన అనసూయకు ఒక నెటిజన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈ సందర్భంగా సదరు నెటిజన్ ప్రశ్నిస్తూ.మీరు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సినిమాలో ఎప్పుడూ నటిస్తున్నారు అంటూ ప్రశ్న వేశారు.

Telugu Anasuya, Ap, Og, Pawan Kalyan, Tollywood-Movie

ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించానని సమాధానం ఇచ్చారు.దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏ సినిమాలో ఈమె ఒక చిన్న పాత్రలో నటించారనే విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్లుతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలన్నీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకొని వాయిదా పడ్డాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఈయన బాధ్యతలు తీసుకోవడంతో సినిమాలకు విరామం ప్రకటించారు.

తనకు వీలైనప్పుడు ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube