బాబు ప్లాన్ వర్కౌట్ అయితే ఏపీలో 25,000 ఉద్యోగాలు.. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారా?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( CM Nara Chandrababu Naidu ) అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, అమరావతిని అభివృద్ధి చేస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి ఉచిత ఇసుక స్కీమ్ ను కూడా అమలు చేస్తున్నారు.

 Chandrababu Naidu Shocking Decision Details Inside Goes Viral In Social Media-TeluguStop.com

ఉచిత ఇసుక స్కీమ్ గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నా చాలా ప్రాంతాలలో గత ప్రభుత్వం అమలు చేసిన రేట్లతో పోలిస్తే తక్కువ రేటుకే ఇసుక లభ్యమవుతోంది ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీపీసీఎల్( BPCL ) ప్రతినిధులతో భేటీ అయ్యారు.బీపీసీఎల్ ప్రతినిధులు చంద్రబాబుతో రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు గురించి చర్చించారు.

దాదాపుగా 60 వేల కోట్ల రూపాయలతో ఈ రిఫైనరీ ఏర్పాటు జరిగితే దాదాపుగా 25 వేల మందికి ఉద్యోగాలను కల్పించవచ్చని సమాచారం అందుతోంది.

-Politics

కొన్నిరోజుల క్రితం సీఎం చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురితో భేటీ కావడం జరిగింది.మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించడం గమనార్హం.మరోవైపు సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) కు అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

-Politics

సీఎం చంద్రబాబు నాయుడు పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయనే అంశంపై చర్చించారని తెలుస్తోంది.చంద్రబాబు పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారా అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని కంపెనీల ఏర్పాటు దిశగా అడుగులు వేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube