`విట‌మిన్ డి` ఎక్కువైతే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే.శ‌రీరానికి అన్ని ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ళ్లు అందాలి.

 Do You Know What Problems Can Occur If You Are High In Vitamin D! Vitamin D, Hea-TeluguStop.com

అలా అందాలి అంటే ప్ర‌తి రోజు ఖ‌చ్చితంగా పోష‌కాహారం తీసుకోవాలి.ఇదిలా ఉంటే.

నేటి కాలంలో కోట్ల మంది ఫేస్ చేస్తున్న స‌మ‌స్య `విట‌మిన్ డి` లోపం.ముఖ్యంగా చిన్న పిల్ల‌లు, ఆడ‌వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.

అయితే వాస్త‌వానికి ఎముకలు, కండరాలు, దంతాలు బ‌లంగా ఉండాల‌న్నా.క్యాన్సర్‌, గుండె జ‌బ్బులు, మధుమేహం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌న్నా.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాల‌న్నా.విట‌మిన్ డి ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిందే.

,/br>

అందుకే నిపుణులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు విట‌మిన్ డి శ‌రీరానికి అందేలా చూసుకోవాల‌ని చెబుతుంటారు.అయితే శ‌రీరానికి విట‌మిన్ డి అవ‌స‌రం క‌దా అని.ఓవ‌ర్‌గా మాత్రం తీసుకోరాదు.ఎందుకంటే, ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

విట‌మిన్ డి శ‌రీరంలో ఎక్కువైతే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.మ‌రి ఇంత‌కీ విట‌మిన్ డి ఎక్కువైతే కలిగే దుష్ప్రభావాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Latest, Vitamin-Telugu Health - తెలుగు హెల్త

ఎముక‌ల‌ను బ‌లంగా మార్చ‌డంలో విట‌మిన్ డి కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.అయితే ఇక్క‌డ మీకు తెలియ‌ని విష‌యం ఏంటంటే.శ‌రీరంలో విట‌మిన్ డి ఎక్కువైనా.ఎముక‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంది.ఎముకల క్షీణతకు గుర‌వుతాయి.అలాగే శ‌రీరంలో విట‌మిన్ డి ఎక్కువైన‌ప్పుడు జీర్ణ సమస్యలు త‌లెత్తుతాయి.

ముఖ్యంగా క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

శ‌రీరంలో విట‌మిన్ డి ఎక్కువైతే.

దాని ప్ర‌భావం మృత పిండాల‌పై తీవ్రంగా ప‌డుతుంది.ముఖ్యంగా మూత్రపిండాలు పాడయ్యే రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఇక విట‌మిన్ డి అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కాల్షియం శాతం పెరిగిపోతుంది.ఫ‌లితంగా అలసట, అధిక ర‌క్త పోటు, వికారం, వాంతులు, ఆక‌లి మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయి.

అందుకే శ‌రీరానికి విట‌మిన్ డి ఎంత అవ‌స‌ర‌మో.అంతే తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube