చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..

మన ఆరోగ్యాన్ని ఎప్పుడూ కాపాడుకోవడానికి ఈ శరీరంలో రోగనిరోగ శక్తి ఉండడం ఎంతో ముఖ్యం.రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మనం అనేక వ్యాధులతో బాధపడవలసి ఉంటుంది.

 To Stay Away From Health Problems In Winter, You Have To Do This , Health , Heal-TeluguStop.com

అయితే చలికాలం మొదలవడం వల్ల అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రజలను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.దీనివల్ల చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి.

ఈ సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి.ఈ సమయంలో కచ్చితంగా కఠినమైన ఆహార నియమాలను పాటించడం మంచిది.

సీజన్ కు తగినట్లు మన ఆహారపు అలవాటులను మార్చుకోవడం ఎంతో ముఖ్యం.అలా చేయడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.

చలికాలంలో మన రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా పనిచేసే కొన్ని రకాల వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో ఆరోగ్యం కోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం అల్లం, క్యారెట్స్ ఉత్తమమైనదని చెబుతున్నారు.

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తో పాటు అల్లం లోని గుణాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.కంటి సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు కూడా క్యారెట్ లో పోషక గుణాలు ఎంతగానో మేలు చేస్తాయి.

ఇందులో పుష్కలంగా ఉండే బీటా కేరోటిన్ ఇన్ఫెక్షన్లను దూరం గా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.అల్లం క్యారెట్ సూప్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ లను కూడా ఇవి తగ్గిస్తాయి.

ఇంకా చెప్పాలంటే ముగ్ పప్పు, కొబ్బరి మరియు కివితో చేసిన సూప్ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.కివిలో ఉండే విటమిన్ సి రోగరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది.మిక్స్డ్ వెజిటేబుల్స్ సూప్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ సూప్ లో మీకు నచ్చిన కూరగాయలు ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి సూప్ చేసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube