ఒక్క దెబ్బతో చుండ్రు పోవాలా? అయితే ఈ పవర్ ఫుల్ రెమెడీ మీకే!

ప్రస్తుత వింటర్ సీజన్ లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని అత్యధికంగా వేధించే సమస్యల్లో చుండ్రు ముందు వరుసలో ఉంటుంది.చుండ్రు అనేది చిన్న సమస్యగానే కనిపించిన తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

 A Powerful Remedy To Get Rid Of Dandruff Easily Is For You! Powerful Remedy, Dan-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం మార్కెట్లో లభ్యం అయ్యే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్‌ హోమ్ రెమెడీని పాటిస్తే ఒక్క దెబ్బతో చుండ్రును పోగొట్టుకోవచ్చు.మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక అలోవెరా ఆకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బృంగరాజ్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ వేపాకుల పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మెంతులు పౌడర్ వేసుకుని స్పూన్ తో కలుపుకోవాలి.

ఆ తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా చేస్తే ఒక్క దెబ్బతో చుండ్రు పోతుంది.

చుండ్రు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అని భావించేవారు వారంలో ఒకసారి ఈ రెమెడీని పాటించవచ్చు.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

తెల్ల జుట్టు సమస్య త్వరగా ద‌రి చేర‌కుండా ఉంటుంది.మరియు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube