సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, జుట్టు సంరక్షణ లేకపోవడం, కాలుష్యం తదితర కారణాల వల్ల జుట్టు క్రమంగా రాలిపోయి పల్చగా మారుతుంటుంది.
దాంతో ఏం చేయాలో తెలియక లోలోన తీవ్రంగా మదన పడిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే నెల రోజుల్లో ఒత్తుగా మారడం ప్రారంభం అవుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏమిటి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఉల్లిపాయ తురుము వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ, రెండు బిర్యానీ ఆకులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు హీట్ చేయాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలతో పాటు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే పల్చటి జుట్టు కేవలం కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారడం ప్రారంభం అవుతుంది.
అదే సమయంలో హెయిర్ ఫాల్ సైతం అదుపులోకి వస్తుంది.