అలాగే శరీరంలో విటమిన్ డి ఎక్కువైనప్పుడు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా కడుపు నొప్పి, మలబద్ధకం, ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే.దాని ప్రభావం మృత పిండాలపై తీవ్రంగా పడుతుంది.
ముఖ్యంగా మూత్రపిండాలు పాడయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.ఇక విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం శాతం పెరిగిపోతుంది.
ఫలితంగా అలసట, అధిక రక్త పోటు, వికారం, వాంతులు, ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
అందుకే శరీరానికి విటమిన్ డి ఎంత అవసరమో.అంతే తీసుకోవాలి.