జర్మనీలో( Germany ) విషాదం చోటు చేసుకుంది.కొద్దిరోజుల క్రితం కనిపించకుండాపోయిన కేరళకు చెందిన భారతీయ యువకుడు శవమై కనిపించాడు.
మృతుడిని 30 ఏళ్ల ఆడమ్ జోసెఫ్‌గా( Adam Joseph ) గుర్తించారు.ఇతను ఓ ఆఫ్రికన్ జాతీయుడి అపార్ట్‌మెంట్( African Apartment ) బాత్‌రూమ్‌లో కత్తిపోట్లకు గురై తీవ్రగాయాలతో పడి ఉన్నాడు.
కుడిచేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతని స్నేహితులు జోసెఫ్‌గా గుర్తించారు.దీనిపై రోమన్ భాషలో అతని పుట్టిన తేదీ రాసి ఉంది.
ఆడమ్ జోసెఫ్ గురించి విచారణ జరుగుతున్న దశలో .ఓ ఆఫ్రికన్ జాతీయుడు తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.ఆత్మరక్షణ కోసం తాను ఓ వ్యక్తిని హత్య చేశానని, అతని మృతదేహం అపార్ట్‌మెంట్‌లో పడిఉందని పోలీసులకు చెప్పాడు.రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన ఆఫ్రికా వ్యక్తి అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు.
జోసెఫ్.తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి తనపై దాడి చేశాడని లొంగిపోయిన వ్యక్తి తమతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మరక్షణ కోసమే( Self-Defence ) తాను అతనిని కత్తితో పొడిచినట్లు చెప్పాడని వెల్లడించారు.
అయితే ఆఫ్రికా వ్యక్తి చెబుతున్న మాటలను మృతుడి బంధువులు నమ్మడం లేదు.ఆడమ్ ఎప్పుడూ అలాంటి పనిచేయడని, ఎవరినీ బాధ పెట్టే మనస్తత్వం కాదని తెలిపారు.ఆఫ్రికన్ జాతీయుడు అబద్ధం చెబుతున్నాడని బెర్లిన్ పోలీసులు కూడా అనుమానిస్తున్నారని, హత్యకు దారి తీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.
ఆడమ్‌ను హత్య చేశారని.అతని మృతదేహాన్ని రెండు రోజుల పాటు అపార్ట్‌మెంట్‌లో ఉంచారని అతని బంధువు ఆవేదన వ్యక్తం చేశారు.
గత బుధవారం జోసెఫ్ స్నేహితులు మిస్సింగ్ కేసు( Missing Case ) ఫైల్ చేసేందుకు ప్రయత్నించారు.అయితే జర్మనీ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి అదృశ్యమైతే ఏడు రోజుల తర్వాతే మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు.జర్మనీలోని భారత రాయబార కార్యాలయం, మలయాళీ సంఘ ప్రతినిధులు తమకు ఎంతో సహకరించారని ఆ బంధువు చెప్పారు.తన థీసిస్‌ను సమర్పించి జనవరిలో కేరళకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నాడని, అంతలో ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.