ఈ మధ్యకాలంలో కొన్ని రైలు ప్రమాద సంఘటనలు జరగడం మనం గమనిస్తూనే ఉన్నాము.కొందరు తెలియని దుండగులు రైలును పట్టాలపై నుండి తప్పించేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు.
పట్టాలపై రైలు పట్టాలు తప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే అదృష్టశాతంగా చాలా ఘటనలలో లోకో పైలెట్లు గమనించి పెను ప్రమాదం నుంచి తప్పించారు.
తాజాగా ఓ గూడ్స్ రైలు మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని రాత్లంలో అర్ధరాత్రి సమయంలో పట్టాలు తప్పిన సంఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో గూడ్స్ రైలులోని ఓడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి.
ఢిల్లీ – ముంబై(Delhi – Mumbai) లైన్లో ఈ ఘటన జరిగింది.
పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైల్వే యార్డ్ సమీపంలో ప్రమాదం నేపథ్యంలో పట్టాలు తప్పయి.ఈ ఘటనలో పెట్రోలియం తరలిస్తున్న గూడ్స్ రైలు (Goods train)పట్టాలు తప్పి పడిపోవడంతో అందులోనే డీజిల్ లీక్ అయింది.దాంతో పట్టాల వెంబడి ఉన్న కాలువలో డీజిల్ ఏరులై పారింది.
అది చూసిన అక్కడి స్థానికులు డీజల్ తీసుకువెళ్లడానికి ఎగబడ్డారు.ఈ నేపథ్యంలో చాలామంది బిందెలు, బకెట్లతో డిజల్ తోడుకొని మరి తీసుకువెళ్లిపోయారు.
పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ ఆ కాల్వ దగ్గరికి చేరుకొని బకెట్లతో డీజిల్ నింపుకొని వెళ్లారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక రైలు పట్టాలు తప్పడంతో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు.అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాత్లం డివిజన్ రైల్వే మేనేజర్ అధికారికంగా తెలిపారు.డీజిల్ లీక్ కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు.