దేవర సినిమా( Devara ) చూసిన చాలామంది ప్రేక్షకులను వెంటాడుతున్న సందేహం ఏంటంటే దేవర పాత్ర చనిపోతే సీక్వెల్ లో ప్రత్యేకత ఏముంటుందని చాలామంది భావిస్తున్నారు.దేవర సీక్వెల్ లో( Devara Sequel ) దేవర ఉంటాడా అనే ప్రశ్నలు సైతం వెంటాడుతున్నాయి.
అయితే సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు జవాబులు దొరికేశాయి.దేవర సీక్వెల్ లో దేవర ఉంటాడని జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చెప్పుకొచ్చారు.
దేవర సీక్వెల్ లో దేవర ఉంటాడని స్వయంగా తారక్ చెప్పగా దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) మాట్లాడుతూ సముద్రంలోని శవాలలో ఒక శవం ముఖ్యమైన పాత్రకు సంబంధించినదని చెప్పుకొచ్చారు.ఆ శవం యతికి సంబంధించిన శవం అయ్యి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు దేవర సీక్వెల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.దేవర1 ను మించి దేవర సీక్వెల్ విషయంలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.
దేవర సీక్వెల్ బడ్జెట్ పరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా టాప్ మూవీ అని చెప్పవచ్చు.ఏపీలో భారీ స్థాయిలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు దేవర మూవీకి మేలు చేశాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.దేవర సీక్వెల్ పై ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సీక్వెల్ ను వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పవచ్చు.
మాస్ ప్రేక్షకులకు దేవర మూవీ ఎంతగానో నచ్చేసిందని చెప్పవచ్చు.దేవర సినిమా విజయం సాధించిన నేపథ్యంలో మరిన్ని మాస్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.మాస్ సినిమాలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
దేవర సినిమాతో బీ, సీ సెంటర్ల థియేటర్లు కళక్లలాడుతున్నాయని తెలుస్తోంది.చాలామంది బయ్యర్లకు రెండు రెట్లు, మూడు రెట్లు లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.