కోర్టులో హాజరు కావడానికి మేకప్‌ డిమాండ్ చేసిన లేడీ మర్డరర్‌..?

ఈ రోజుల్లో కొంతమంది కెమెరాల ముందు అందంగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నారు.వారి తీరు చూస్తుంటే షాక్‌ అవ్వకుండా ఉండలేకపోతున్నాము.

 Lady Murderer Who Demanded Make-up To Appear In Court, Makeup Demand, Lady Pris-TeluguStop.com

తాజాగా ఒక మహిళ ఖైదీ కోర్టుకు హాజరు కావాలంటే తనకు మేకప్ వేయాల్సిందే అని డిమాండ్ చేసింది వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడా( Florida)లోని సారా బూన్( Sarah Boone ) అనే మహిళ తన ప్రియుడిని సూట్‌కేసులో పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.ఈ కేసులో ఆమెపై సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదైంది.

తన విచారణకు ముందు, ఆమె న్యాయమూర్తికి ఒక విచిత్రమైన విన్నపం చేసింది.

Telugu Boyfriend, Florida, Jorge, Lady, Demand, Sarah Boone-Telugu NRI

తన జుట్టు, ఫేస్‌కు మేకప్‌ వేసుకుంటానని ఆమె తెలిపింది.ప్రొఫెషనల్‌గా స్టైలింగ్ చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది.కోర్టుకు వెళ్లేటప్పుడు తాను అందంగా కనిపించాలని చెప్పింది.

కానీ, ఆమె ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, భద్రతా సమస్యలు, ఇతర కారణాల వల్ల న్యాయమూర్తి ఆమె విన్నపాన్ని తిరస్కరించారు.సారా బూన్ కోర్టులోకి వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకోవడానికి ఆమె న్యాయవాదులకు అనుమతి ఇస్తామని న్యాయమూర్తి మొదట అంగీకరించారు.

కానీ, ఆరంజ్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్ నిర్ణయాన్ని మార్చుకుంది. జైలులో మేకప్‌ను నిషేధించిన వస్తువు అని, అది భద్రతకు ముప్పు అని వారు చెప్పారు.దీంతో ఆమె కోరిక తిరస్కరించబడింది.సారా బూన్‌ 2020, ఫిబ్రవరి 25న వింటర్ పార్క్ అపార్ట్‌మెంట్‌( Winter Park Apartments )లో రాత్రి భారీగా మద్యం తాగి ప్రియుడిని హత్య చేసింది.

Telugu Boyfriend, Florida, Jorge, Lady, Demand, Sarah Boone-Telugu NRI

పోలీసులు సారా బూన్‌ని ప్రశ్నించినప్పుడు, ఆమె తన ప్రియుడు జార్జ్ టోర్రెస్ Jorge Torres ) జూనియర్‌తో కలిసి చాలా మద్యం తాగి, ఆ తర్వాత దాగుడుమూతలు ఆడామని చెప్పింది.టోర్రెస్ సూట్‌కేసు నుంచి బయటకు వచ్చేశాడని అనుకుని, ఆమె 30 నిమిషాలు పడుకుంది.మరుసటి ఉదయం టోర్రెస్ తన పక్కన లేకపోవడంతో, అతను కింద ఫ్లోర్‌లో ఉన్నాడని అనుకుంది.ఉదయం 11 గంటలకు కిందకు వెళ్లి చూసినప్పుడు, అతను చనిపోయి ఉన్నాడు.

పోలీసులు సారా బూన్‌ ఫోన్‌లో ఒక వీడియోను కనుగొన్నారు.ఆ వీడియోలో, టోర్రెస్ సూట్‌కేసులో చిక్కుకుపోయి, బయటకు వదలమని వేడుకుంటూ, “నాకు ఊపిరి ఆడటం లేదు.” అని అరుస్తున్నాడు.కానీ బూన్ అతని ప్రార్థనలను పట్టించుకోలేదు.

అలా అతను చనిపోయాడు.అక్టోబర్ 7న జరగనున్న కోర్ట్ విచారణలో ఆమె సెకండ్ డిగ్రీ మర్డర్ రుజువైతే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube