కోట్లు ఇచ్చినా ఆ పాత్రలు చేయమంటున్న టాప్ హీరోయిన్లు..

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా కీలకంగా ఉండేవి.వారి చుట్టే పలు సినిమా కథలు తిరిగేవి కూడా.

 Tollywood Heroines Not Interested In Few Things , Keerthi Suresh , Sai Pallavi,-TeluguStop.com

అప్పటి నటీమణులంతా నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేవారు.కానీ ప్రస్తుతం సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

హీరోయిన్లను సినిమాల్లో కేవలం గ్లామర్ డాల్స్ గానే చూపిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అయితే కేవలం పాటలకు కొన్ని రొమాంటిక్, మరికొన్ని ఎక్స్ పోజింగ్ సీన్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు.

అయితే ఈ కాలంలోని నటనా ప్రాధాన్యత లేని సినిమాల్లో చేయమని తెగేసి చెప్తున్నారు కొందరు హీరోయిన్లు.వారి తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నా ముమ్మాటికీ వాస్తవం.

ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సౌత్ లో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు కీర్తి సురేష్, సాయి పల్లవి.

వారితో సినిమాలు చేసేందుకు పలువురు దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వీళ్లు.

అందాల ప్రదర్శనకు, నటనా ప్రాధాన్యం లేని పాత్రలు చేసేందుకు నో చెప్తున్నారు.దీంతో వీరికి ఎక్కువగా ఆఫర్లు రావడం లేదనే విమర్శలున్నాయి.

వచ్చినా అంగాంగ ప్రదర్శనకు నో చెప్తున్నారు.దీంతో పలువురు ఫిల్మ్ మేకర్స్ వెనక్కి వెళ్లిపోతున్నారు.

Telugu Fida, Keerthi Suresh, Kollywood, Mahanati, Sai Pallavi, Tollywood-Telugu

కీర్తి సురేష్ కు తమిళంలో ఎంత గుర్తింపు ఉందో.తెలుగులోనే అదే స్థాయిలో పేరుంది.సాయి పల్లవికి కూడా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మంచి పేరు తెచ్చుకుంది.వీరిద్దరు గ్లామర్ పాత్రలకు ఓకే చెప్తే బోలెడు సినిమాలు వీరి ముందు క్యూ కడతాయి.

కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడ్డం లేదు.అయితే తమకు కోట్లు అవసరం లేదు.

నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే కావాలని తేల్చి చెప్తున్నారు.అవే పాత్రలు చేస్తున్నారు కూడా.

ఇంతకీ వీరు ఇక ముందైనా స్కిన్ షోకు ఓకే చెప్తారో? లేదో? వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube