తెలుగమ్మాయి షన్ముక ప్రియ ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ ఫైనల్ వరకు వెళ్లింది.ఫైనల్ 6 లో నిలిచిన షన్ముక ప్రియ కు క్యాంపెయిన్ తగ్గింది.
ఆమెకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా గెలిచేది అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విజయ్ దేవరకొండ మినహా మరెవ్వరు కూడా ఆమె గురించి మాట్లాడిందే లేదు.
ఇతర కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం జరిగింది.కాని షన్ముక ప్రియ గురించి మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు.
దాంతో ఆమె చివరి స్థానంలో నిలిచింది.షన్ముక ప్రియ వజయం సాధించకున్నా కూడా ఆరవ స్థానంలో నిలవడం అందరికి షాకింగ్ గా ఉంది.
అంతటి ప్రతిభావంతురాలైన షన్ము ఇలా ఆరవ స్థానంలో నిలవడం అంటే ఖచ్చితంగా అభిమానుల నుండి ఓట్లు రాకపోవడమే.
సినిమా ఇండస్ట్రికి చెందిన వారు కాస్త ఆమె తరపున ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది.కనీసం రన్నరప్ గా అయినా ఆమె నిలిచేది అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు.షన్ముక ప్రియకు తెలుగు రాష్ట్రాల్లో అస్సలు ప్రచారం జరగలేదు.
మీడియా అయినా కనీసం ప్రచారం చేసి షన్ముక కు ఓట్లు వేయాల్సిందిగా సూచించలేదు.చాలా మందికి షన్ముక ప్రియకు ఓటు వేయాలని ఉన్నా ఎలా వేయాలో తెలియక ఓటు వేయలేక పోయారు.
షన్ముక ప్రియను ఓటు వేయించక పోవడం వల్లే ఆమె ఓడి పోయిందని.ఇది తెలుగు మీడియా మరియు టాలీవుడ్ వర్గాల వారి తప్పిదం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
షన్ముక ప్రియకు ఇండస్ట్రీ నుండి కనీసం ఇద్దరు ముగ్గురు ముందు నుండి ప్రచారం చేస్తే వారి దారిలో మరి కొందరు వచ్చే వారు అలా షన్నుకు ఓట్లు దక్కేవి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.