రుచిగా ఉంటుందని తరచూ కేక్ ను లాగించేస్తున్నారా.. అయితే మీకీ రోగాలు ఖాయం!

బర్త్ డే అయినా మ్యారేజ్ డే అయినా లేదా ఇంకేమైనా సెలబ్రేషన్ అయినా కచ్చితంగా కేక్ ఉండాల్సిందే.రకరకాల ఫ్లేవర్స్ లో రకరకాల కేక్స్ మనకు అందుబాటులో ఉంటున్నాయి.

 Side Effects Of Eating Too Much Cake! Cakes, Cake Side Effects, Eating Cake, Des-TeluguStop.com

పిల్లల నుంచి పెద్దల వరకు కేక్స్ ని ఎంతో ఇష్టంగా తింటుంటారు.మనలో చాలా మంది కేక్ లవర్స్ ( Cake lovers )ఉన్నారు.

కేక్ కనపడితే చాలు తెగ లాగించేస్తుంటారు.ముఖ్యంగా లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత కేక్ తినే అలవాటు ఎంతో మందికి ఉంటుంది.

అయితే రుచిగా ఉంది క‌దా అని తరచూ కేక్ తింటున్నారా.అయితే ఏరికోరి జబ్బులను మీరు కొనితెచ్చుకున్నట్లే.

కేక్స్ త‌యారీలో చ‌క్కెరను ( Sugar )అధికంగా వినియోగిస్తారు.చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగ‌ట మరియు ఊబకాయం ఏర్పడుతుంది.అలాగే కేక్స్ వంటి షుగర్ డిజర్ట్‌లను త‌ర‌చూ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ త‌ప్పుతాయి.మ‌ధుమేహం( diabetes ) వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.

ఒక‌వేళ్ల ఆల్రెడీ మ‌ధుమేహం ఉంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.

Telugu Cake Effects, Cake, Tips, Latest, Effects Cake, Sugar-Telugu Health

అతిగా కేక్స్ తినే వారిలో క్యాన్స‌ర్ ( Cancer )ముప్పు పెరుగుతుంద‌ని ప‌లు ఆధ్య‌య‌నాల్లో తేలింది.పైగా కేక్స్‌ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్‌ కారక అంశాలు ఉన్నట్లు ఇటీవ‌ల‌ కర్నాటక రాష్ట్ర ఆహార భద్రత, నాణ్యత శాఖ గుర్తించింది.ముఖ్యంగా కేక్స్ త‌యారీలో వాడే క‌ల‌ర్స్ చాలా ప్రమాదకరమని వారు తెలిపారు.

అలాగే కేక్ వంటి బేక్డ్ ఫుడ్స్ లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దోహదపడుతుంది.

Telugu Cake Effects, Cake, Tips, Latest, Effects Cake, Sugar-Telugu Health

కేక్స్ ను అతిగా తిన‌డం వ‌ల్ల.వాటిలోని చక్కెర మరియు ఆమ్లాల కలయిక కాలక్రమేణా దంతాల ఎనామిల్‌ను నాశనం చేస్తుంది.దంత క్షయానికి కార‌ణం అవుతుంది.

అంతేకాదు కేక్స్ ను త‌ర‌చూ తింటే మెద‌డు ప‌ని తీరు మంద‌గిస్తుంది.ఎందుకంటే చక్కెర ఆహారాలు బలహీనమైన జ్ఞాపకశక్తికి దారి తీస్తుంది.

మరియు చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.కాబ‌ట్టి ఎంత మ‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ ఇక‌నైనా కేక్స్ తిన‌డం త‌గ్గించండి.

వీలైతే మానేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube