హైడ్రా, మూసినది ప్రక్షాళన వంటి విషయంలో రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దూకుడుగా ముందుకు వెళ్లడం, సొంత పార్టీ నాయకులు చాలామందికి ఏ మాత్రం నచ్చడం లేదు.ఇప్పటికే కాంగ్రెస్ ప్రముఖులు చాలామంది అధిష్టానం పెద్దలకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
రేవంత్ దూకుడుగా ముందుకు వెళుతూ, కూల్చివేతలకు పాల్పడుతూ ఉండడం కాంగ్రెస్ కు( Congress ) అంతిమంగా నష్టం చేకూరుస్తుందని, వెంటనే ఈ విషయంలో కలుగజేసుకుని రేవంత్ స్పీడుకు బ్రేకులు వేయాలని అధిష్టానం పెద్దలకు చాలామంది కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తులు చేశారు .ఇక రేవంత్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు ఢిల్లీ అధిష్టానం పెద్దలను కలుస్తూ , తన కార్యాచరణను వివరిస్తూ వస్తున్నారు.ముఖ్యంగా హైడ్రా,( HYDRA ) మూసీ నది ప్రక్షాళన( Musi River Cleaning ) విషయంలో తన విజన్ ఏమిటి అనేది వివరించి అధిష్టానం పెద్దల వద్ద పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టారు.

ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో సక్సెస్ అయ్యారట.ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆక్రమణల విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని, అన్ని కూలిస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేయడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది .లక్షన్నర కోట్లు తో మూసిని ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయంలో ముందడుగు వేసింది.మూసి వెంట ఉన్న ఆక్రమణలను తొలగించి సుందరి కరణ చేయగలిగితే హైదరాబాద్ ప్రజలు తనకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడతారని రేవంత్ భావిస్తున్నారు.మూసీనది ఆక్రమణలతో ఉండడం తో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా వరదలు ముంచెత్తి నగరవాసులను అష్ట కష్టాలకు గురి చేస్తున్నాయని , ఆ బాధ తీర్చగలిగితే తనకు నగరవాసుల మద్దతు లభిస్తుందని,

రేవంత్ దూకుడుతో రాజకీయంగా కొంతమేర నష్టపోతామని తెలిసినా రేవంత్ ముందడుగు వేస్తున్నారు.ఇక హైడ్రా విషయంలో అనేక విమర్శలు వ్యక్తం అవుతూ ఉండడం, చెరువులు , కొండలు, వాగులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చి వేస్తూ ఉండడం, ఇందులో ప్రభుత్వ భవనాలు, కాంగ్రెస్ ప్రముఖు లకు చెందిన భవనాలు రేవంత్ ఏమాత్రం లెక్క చేయకపోవడం వంటివి కొంతమంది కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదు.ఇక హైడ్రా ను ఏర్పాటు చేసి దానికి ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు .మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో దానికి ఆమోదం లభిస్తే న్యాయపరంగానూ తమకు ఇబ్బందులు ఉండవని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.ఈ కూల్చివేత విషయంలో కొన్నిచోట్ల నిరసన వ్యక్తం అవుతున్నా, ఎక్కువ శాతం మంది సమర్థిస్తున్నారని రేవంత్ కు నివేదికలు అందాయట.ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల వద్ద ప్రస్తావించి వారి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టడంతోనే రేవంత్ మరింత దూకుడు పెంచే ఆలోచనతో ఉన్నారట.