గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?

ఈమధ్య సోషల్ మీడియా( Social media)లో ఫేమస్ కావడానికి ఏది పడితే అది పోస్ట్ చేయడం పరిపాటుగా మారింది చాలామందికి.ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేసిన వారు నిజమైన షయమావి లేదా అని ఆలోచించకుండా నమ్మేస్తున్నారు.

 109 Year Old Siyaram Baba Viral Video, 188 Year Old Man, Viral Video, 109 Year O-TeluguStop.com

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

తాజాగా బెంగుళూరు( Bengaluru ) సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్ధుడిని అక్కడి స్థానికులు బయటకి తీసుకోవచ్చారని.అతని వయసు 188 ఏళ్ళు ఉంటాయని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే, ఆ వీడియోలో ఉన్నది అసలు కర్ణాటక( Karnataka)నే కాదని అతడు మధ్యప్రదేశ్ కు చెందిన సియారాం బాబా( Siyaram Baba ) అని చాలామంది తెలపడంతో ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.ఆయనకి 188 ఏళ్లు కాదని.110 ఏళ్ళు మాత్రమే అంటూ చాలామంది కామెంట్స్ లో తెలిపారు.సియారాం బాబా రామ భక్తుడని పదేళ్లపాటు వంటి కాలుతో కఠినమైన తపస్సు చేశారని మధ్యప్రదేశ్లో వినికిడి.

ఆయన తన జీవితాన్ని రాముడికి, రామాయణానికి అంకితం చేశారని.100 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అతను ఎలాంటి కళ్ళజోడు లేకుండా పుస్తకం చాలా బాగా చదువుతున్నాడని., ఆయన ఏకంగా ఒక రోజులో 21 గంటల పఠన సామర్థ్యం కలవాడని కొందరు తెలిపారు.కాబట్టి ఏదైనా విషయాన్ని తెలుసుకునే సమయంలో ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తున్నార లేదన్న విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఇక ఈ ఫేక్ సమాచారాన్ని క్రియేట్ చేసిన వ్యక్తులను పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.మరి కొందరైతే అసలు ఇలా చేయాలని ఎలా ఆలోచనలు వస్తాయంటూ మండిపడుతున్నారు కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube