130 ఏళ్ల కెమెరాతో రగ్బీ మ్యాచ్ క్యాప్చర్‌.. అందులో ఏం కనిపించిందో చూసి..?

ఇంగ్లాండ్‌( England) దేశం, బాత్‌సిటీలోని ప్రముఖ రిక్రియేషన్ గ్రౌండ్‌లో ఓ రగ్బీ మ్యాచ్‌ జరిగింది.దీనిని 130 ఏళ్ల కెమెరాతో చిత్రీకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒక ఫొటోగ్రాఫర్.మైల్స్ మైయర్స్కోచ్-హారిస్( Miles Myerscough-Harris ) అనే ఈ ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.“వింటేజ్ లెన్స్” ద్వారా ప్రపంచాన్ని చూడటం ఈయనకు చాలా ఇష్టమని ఆయన ఇన్‌స్టాగ్రామ్ బయోలో రాసున్నారు.ఈ రిక్రియేషన్ గ్రౌండ్‌లోనే బాత్ రగ్బీ క్లబ్ తమ హోమ్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఈ క్లబ్‌కు ఈయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.”130 ఏళ్ల పాత పనోరమిక్ కెమెరాతో రగ్బీ మ్యాచ్‌ను చిత్రీకరించాను.బాత్ సిటీ రగ్బీకి నిలయమైన ఈ రిక్రియేషన్ గ్రౌండ్ చాలా చారిత్రాత్మకమైన స్టేడియం.దీని చరిత్రను గౌరవించడానికి, దీని కంటే కొంచెం తక్కువ వయసున్న, 130 ఏళ్ల కెమెరాతో దీన్ని రికార్డ్ చేయాలని నేను అనుకున్నా.” అని ఆయన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.

 130-year-old Vintage Camera Captures Iconic Rugby Stadium , Vintage Camera, Rugb-TeluguStop.com

రగ్బీ స్టేడియం( Rugby) చాలా రద్దీగా ఉండే ఒక బాల్కనీ నుంచి ఈ ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు.ఆ ఓల్డ్ కెమెరా చాలా జాగ్రత్తగా ఒక లెదర్ కవర్‌లో ఉంది.ముందుగా, కెమెరాలోని కొన్ని భాగాలను తీసివేసి, ఫిల్మ్‌ను ఒక ప్రత్యేకమైన ప్యానెల్‌కు అతికించాడు.ఆ తర్వాత వ్యూఫైండర్ ద్వారా చూస్తూ, ఫోటో తీసే బటన్ నొక్కాడు.

అన్ని ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ రంగులో వచ్చాయి.ప్రతి ఫోటోలో కొంచెం గ్రేన్స్ కనిపించినా, చాలా స్పష్టంగా ఉన్నాయి.ఆ కెమెరాలో ఉన్న వైడ్-యాంగిల్ లెన్స్ వల్ల మొత్తం స్టేడియం కనిపించేలా ఫోటోలు తీయగలిగాడు.రాత్రి ఆకాశంలో వెలుగుతున్న ఫ్లడ్‌లైట్స్ కూడా ఫోటోల్లో చాలా బాగా కనిపిస్తున్నాయి.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 11 లక్షల మంది చూశారు.ఈ ఫోటోలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఫొటోగ్రాఫర్‌ను చాలా మంది ప్రశంసించారు.చాలా మంది ఆ ఫోటోలను చూసి చాలా ఆశ్చర్యపోయారు.

ఒకరు, “ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయి! చాలా పాత కాలపు ఫోటోలు లాగా ఉన్నాయి” అని కామెంట్ చేశారు.మరొకరు, “ఈ రిక్రియేషన్ గ్రౌండ్ ఫోటోల ప్రింట్‌లు అమ్ముతారా? అమ్ముతే నేను కొనాలనుకుంటున్నాను” అని అడిగారు.మరొకరు ఆ కెమెరాలో ఏ రకమైన ఫిల్మ్ వాడారో అని అడిగారు.“నేను 2001లో డిజిటల్ కెమెరా వాడటం మొదలుపెట్టిన తర్వాత ఫిల్మ్ కొనలేదు.నేను నా కొడుకుతో కలిసి కొన్ని సార్లు ఈ రిక్రియేషన్ గ్రౌండ్‌కి వెళ్లాను, ఇది చాలా ప్రత్యేకమైన ప్రదేశం” అని చెప్పారు.ఒక ఐఫోన్ యూజర్, ఇలాంటి పాత కాలపు ఫోటోలు తీయడానికి ఒక iOS యాప్ ఉందని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube