ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.23
సూర్యాస్తమయం: సాయంత్రం 05.33
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు:నవమి చిత్త ,సా.05.00 నుంచి 06.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.
దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.
కర్కాటకం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెడతారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సింహం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవటం వల్ల అనుకూలంగా ఉంటుంది.
కన్య:
ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
తులా:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల ప్రశంసలు అందుకుంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.సమాజంలో గౌరవాన్ని కోల్పోయే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు శ్రద్ధ వహించాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సహాయం చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU