బిగ్‌బాస్ సీజన్ 8లో( Bigg Boss 8 ) రెండో వారం నామినేషన్స్ చాలా ఇంటెన్స్‌గా జరిగాయి.కొట్లాట ఒక్కటే తక్కువ అన్నట్లు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ముఖ్యంగా సోనియా ఆకుల,( Sonia Akula ) విష్ణుప్రియ( Vishnu Priya ) మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది.సోనియా – నిఖిల్ మధ్య ఏదో నడుస్తోంది అన్నట్లుగా ఇంతకుముందు విష్ణుప్రియ మాట్లాడింది.
మీ మధ్య ఏంటి ఇంత మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది అంటూ అడిగింది.దాంతో సోనియా బాగా సీరియస్ అయ్యింది.“మాపై నువ్వు అడల్టరేటెడ్ కామెడీ చెయ్యద్దు” అన్నట్లు వార్నింగ్ ఇచ్చింది.తర్వాత విష్ణుప్రియ సారీ చెప్పింది.
అంతటితో అది ఆగిపోలేదు.చివరికి నువ్వేదో పుణ్యస్త్రీ అన్నట్టు మాట్లాడుతున్నావేంటి అంటూ విష్ణుప్రియ కూడా మాట జారేసింది.

అయితే బిగ్‌బాస్ సెకండ్ వీక్ నామినేషన్స్ సమయంలో వారి మధ్య శత్రుత్వం మరొకసారి బయటపడింది.ఆ సమయంలో విష్ణుప్రియ “చిన్న ప్రశ్నకే నువ్వు అంత సీరియస్ అయ్యావు.ఈ హౌజ్‌లో ఉండే అర్హత నీకు లేదని నేను భావిస్తున్నాను.అందుకే నామినేట్ చేస్తున్నాను.” అని విష్ణుప్రియ చెప్పింది.తర్వాత చాలా హుందాగా ప్రవర్తించింది.
సోనియా మాత్రం గలీజ్ గా మాట్లాడింది.ఆ మాటలు విన్నాక సోనియాది నోరా? లేదంటే డ్రైనేజీహా? అని ఆడియన్స్ ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు.ఎందుకంటే సోనియా అంత చండాలంగా మాట్లాడింది.

“సరిగ్గా బట్టలు కూడా వేసుకోవు నువ్వు.ఆయన ఒకవైపు అన్‌కంఫర్టబుల్ అంటున్నా ఆయన పక్కకే వెళ్లి నిల్చుంటావు.నువ్వు చేసిందంతా ఏంటి.నీ మాటలు, చేతలు చూస్తుంటే హౌస్‌లో అందరికీ అలానే అనిపిస్తాయి.” అని సోనియా విష్ణుప్రియ గురించి పెద్ద మాటలు మాట్లాడింది.తాను అడల్టరేటెడ్ జోకులు ఎప్పుడూ వేయలేదని, ఒకవేళ జోకులు పేలిస్తే అవేవో ఎక్స్ప్లెయిన్ చేయాలంటూ విష్ణుప్రియ ఓపికగానే అడిగింది.కానీ ఆమె దానికి సమాధానం చెప్పకుండా “నీకంటే ఫ్యామిలీ లేదు.
నాకు ఫ్యామిలీ ఉంది నీ గురించి ఎవరేమనుకున్నా నీకేం కాదు కదా” అంటూ దారుణంగా మాట్లాడింది.విష్ణు ప్రియ తల్లి( Vishnu Priya Mother ) కొద్దిరోజుల క్రితం కన్నుమూశారు.

దాంతో ఆమె అనాధ అయ్యింది.కానీ “నీకు ఫ్యామిలీ లేదు” అని ఒకరిని హర్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు.నీకు ఎవరూ లేరు గాలికి పోయేదానివి అంటూ ఒకరు అవమానిస్తే ఎవరూ తట్టుకోలేరు.బాగా ఏడ్చేస్తారు.ఏదో సింపతి కోసం మాత్రం కాదు, ఇలాంటి పదాలు గుండెల్ని పిండేస్తాయి.ఒక అమ్మాయి క్యారెక్టర్ ను అసాసినేట్ చేసేస్తాయి.
కానీ ఇక్కడ విష్ణుప్రియ తట్టుకుంది.ఆమె అన్ని మాటలు అన్నా చాలా కామ్ గా ఉండిపోయింది.
కానీ ప్రేక్షకులు మాత్రం సోనియాని ఏకిపారేస్తున్నారు.ఒకరి బట్టల గురించి, ఒకరి ఫ్యామిలీ గురించి మాట్లాడి నీ చీప్ మెంటాలిటీ ని బయట పెట్టుకున్నావ్ అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు.
విష్ణుప్రియ బయట తమకు నచ్చకపోయినా హౌస్ లో మాత్రం చాలా చక్కగా ప్రవర్తిస్తూ తమ మనసులను గెలుచుకుందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.మొత్తం మీద సోనియా నోటికొచ్చినట్లు తప్పుడు మాటలు మాట్లాడి అందరి ఆగ్రహానికి గురైంది.