మహిళలు ప్రెగ్నెన్సీ ( Pregnancy )సమయంలోనే కాదు డెలివరీ అనంతరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆహారం విషయంలో అనేక నియమాలు పాటించాలి.
ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఏది పడితే అది తినేస్తే ఆ ప్రభావం పిల్లల ఆరోగ్యం పై పడుతుంది.అందుకే ఆ టైంలో పిల్లలకు మేలు చేసే ఆహారాన్ని, డెలివరీ నుంచి త్వరగా రికవరీ అయ్యే ఫుడ్ ను తల్లులు డైట్ లో చేర్చుకోవాలి.
మరి ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డు సంపూర్ణ పోషకాహారం.పాలిచ్చే తల్లులు గుడ్డును( Eggs ) డైట్ లో ఉండేలా చూసుకోవాలి.ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డు తీసుకుంటే తల్లికి బిడ్డకు చాలా మేలు.
పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా రోజు ఒకటి లేదా రెండు గ్లాసుల పాలను తీసుకోవాలి.చాలామంది డెలివరీకి ముందే కానీ తర్వాత ఫ్రూట్స్ ను పెద్దగా తీసుకోరు.
కానీ ఫ్రూట్స్ ద్వారా ఎన్నో పోషకాలు లభిస్తాయి.డెలివరీ నుంచి త్వరగా రికవరీ అవడానికి సహాయపడతాయి.
అవకాడో, బొప్పాయి, ఆపిల్ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.సిట్రస్ ఫ్రూట్స్ ను మాత్రం ఎవైడ్ చేయాలి.
డెలివరీ సమయంలో చాలా బ్లడ్ లాస్ అవుతుంది.ఈ క్రమంలోనే మహిళలు రక్తహీనత బారిన పడతారు.ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రసవం అనంతరం క్యారెట్, బీట్ రూట్ వంటి ఐరన్ రిచ్ ఆహారాలను తీసుకోవాలి.పాలిచ్చే తల్లులు రెగ్యులర్ టీ, కాఫీ కి బదులు హెర్బల్ టీలు తీసుకుంటే మేలు.
ప్రసవం అనంతరం తల్లులు సరైన నిద్ర లేక డిప్రషన్ కు లోనవుతుంటారు.అయితే హెర్బల్ టీలు డిప్రెషన్ ను దూరం చేసి మైండ్ ను రిలాక్స్ చేస్తాయి.
అదే సమయంలో బాడీని డీటాక్స్ చేస్తాయి.

జీడిపప్పు( Cashew nut ), బాదం, పిస్తా.ఇలాంటి గింజల్ని రోజూ గుప్పెడు తినాలి.వీటిలో ఉండే పోషకాలు తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచంగా మారతాయి.
ఆకుకూరలు పాల ఉత్పత్తిని పెంచడంలో ముందుంటాయి.అందువల్ల డెలివరీ అనంతరం రోజు ఏదో ఒక ఆకుకూర డైట్ లో ఉండేలా చూసుకోండి.
ఇక తృణధాన్యాలు, మొక్కజొన్న, చికెన్, మీట్, అవిసె గింజలు వంటి ఆహారాలు కూడా పాలిచ్చే తల్లులు డైట్ లో ఉండేలా చూసుకోవాలి.