Shanthi Priya : బాలీవుడ్ హీరో అక్షయ్ నన్ను అవమానించాడు: హీరోయిన్ శాంతి ప్రియ?

మామూలుగా అన్ని సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్లకు బాడీ షేమింగ్ కామెంట్స్ రావడం అన్నది సహజం.చాలా సందర్భాలలో హీరోయిన్లు ఇలా భారీ షేమింగ్ కామెంట్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.

 Shanthi Priya Says Akshay Kumar Body Shamed Her-TeluguStop.com

అలా తాను కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నాను అంటుంది హీరోయిన్ శాంతి ప్రియ( Shanthi priya ).అది కూడా ఒక హీరో నుంచి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ శాంతి ప్రియ జంటగా నటించిన చిత్రం ఇక్కె పె ఇక్కా.
div class=”middlecontentimg”>

ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ కుమార్( Akshay kumar ) తనను బాడీ షేమింగ్ చేశాడని, టాలీవుడ్ లో తనకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురవ్వలేదు అని ఆమె తెలిపింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ శాంతి ప్రియ.ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.

బాలీవుడ్( Bollywood ) హీరో అక్షయ్‌ కుమార్ తో నేను ఇక్కె పె ఇక్కా సినిమా చేశాను.ఒక మిల్లులో ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరిగింది.

ఈ చిత్రంలో నాది గ్లామర్‌ రోల్‌ కాబట్టి కురచ దుస్తులు వేసుకున్నాను.అప్పుడు నా మోకాలు కాస్త కనిపిస్తోంది.

అక్షయ్‌ అది చూసి శాంతి, నీ మోకాలికేమైంది? అన్నాడు.
div class=”middlecontentimg”>

నేను ఏదైనా దెబ్బ తగిలిందేమో అని చూసుకునేసరికి అంత నల్లగా ఉన్నాయేంటి? అన్నాడు.అక్కడున్న అందరూ పగలబడి నవ్వారు.జోక్‌ చేయడం తప్పు కాదు, కానీ అందరి ముందు జోక్‌ చేస్తే దాన్ని ఎగతాళి అంటారు.

నలుగురిలో ఏది పడితే అది వాగకూడదు కదా.సౌత్‌ ఇండస్ట్రీలో మాత్రం దర్శకనిర్మాతలు బొద్దుగా ఉన్న హీరోయిన్సే కావాలనే వాళ్లు.90వ దశకంలో బాడీ షేమింగ్‌ అనేదానికి చోటే లేదు.సౌత్‌ వాళ్లు బొద్దుగా ఉండేవాళ్లే కావాలనేవారు.

ఒకవేళ స్లిమ్‌గా ఉన్న హీరోయిన్స్‌ కావాలనుకుంటే ముంబైకి వచ్చేవారు.సౌత్‌లో నేను కొన్ని సినిమాలే చేశాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ శాంతి ప్రియ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube